సాక్షి, తిరువనంతపురం : భారీ వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన చివరి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా సిరీస్‌నూ కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని టీమిండియా తాను కోచ్ అయ్యాక 2-1తో సిరీస్ సాధించడంపై రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హీరో బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడంటూ ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్ని బుమ్రా ఇవ్వలేదన్నాడు.
’భారత్ ఇన్నింగ్స్ ముగిశాక.. ఆ స్కోరు కాపాడుకోగలమని భావించాం. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధ్యమైంది. ఒత్తిడి లేకుండా ఆడామని ఎవరైనా అంటే అది కచ్చితంగా అబద్ధం చెప్పినట్లే. ఇంత తక్కువ ఓవర్ల మ్యాచ్‌లలో 2-3 బంతుల్లోనే పరిస్థితులు మారిపోయే ఛాన్స్ ఉంది. వెనువెంటనే ఓపెనర్లు ఔటవ్వగా 65 పరుగులు చేస్తే చాలనుకున్నాం. ఆరంభంలో వేగంగా పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతంగా క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులు నియంత్రించడంలో టీమిండియా సక్సెస్ కావడంతో ఒత్తిడిలోనూ కోహ్లి సేననే విజయం వరించింది. తొలిసారి కివీస్ పై టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందని ’ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment