
చహల్ అభినందిస్తున్నభారత ఆటగాళ్లు
డబ్లిన్: భారత క్రికెట్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ‘ఇంగ్లిష్’ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, శిఖర్ ధావన్ (45 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 బంతుల్లో 160 పరుగులు జోడించడం విశేషం. ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ ఛేజ్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమ్స్ షెనాన్ (35 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడం మినహా మిగతావారంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (4/21) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 ఈనెల 29న (శుక్రవారం) జరుగుతుంది.
భారత ఇన్నింగ్స్ మొత్తంలో తొలి ఓవర్, ఆఖరి ఓవర్ మాత్రమే ఐర్లాండ్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మిగిలిన 18 ఓవర్లలో టీమిండియా విధ్వంసం కొనసాగించింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ తమదైన శైలిలో చెలరేగి 16 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. చిన్న మైదానాన్ని సమర్థంగా వాడుకున్న వీరిద్దరు భారీ షాట్లతో చకచకా పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ధావన్ 2 ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో మొదలైన దూకుడు చివరి వరకు సాగింది. ఇదే జోరులో ధావన్ 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరోవైపు రోహిత్ కూడా 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం ధాటిని పెంచాడు. వీరిద్దరే మొత్తం ఇన్నింగ్స్ ఆడగలరనిపిస్తున్న దశలో ఎట్టకేలకు ధావన్‌ను అవుట్ చేసి థాంప్సన్ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. తర్వాత వచ్చిన రైనా (10) ఎక్కువ సేపు నిలవలేదు. ఐర్లాండ్ పేసర్ ఛేజ్ 20వ ఓవర్‌ను 3 వికెట్లతో సంచలనాత్మకంగా ముగించాడు. మూడు బంతుల వ్యవధిలో అతను రోహిత్, ధోని (11), కోహ్లి (0)లను ఔట్ చేయడం విశేషం. భారీ ఛేదనలో భారత స్పిన్నర్ల ముందు ఐర్లాండ్ చతికిలపడింది. షెనాన్ కొన్ని మెరుపు షాట్లు ఆడటం మినహా జట్టు ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేకపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఛేజ్ 97; ధావన్ (సి) థాంప్సన్ (బి) ఓబ్రైన్ 74; రైనా (సి) ఓబ్రైన్ (బి) ఛేజ్ 10; ధోని (సి) థాంప్సన్ (బి) ఛేజ్ 11; పాండ్యా (నాటౌట్) 6; కోహ్లి (సి) థాంప్సన్ (బి) ఛేజ్ 0; పాండే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 208.
వికెట్ల పతనం: 1–160; 2–186; 3–202; 4–202; 5–202.
బౌలింగ్: రాన్‌కిన్ 4–0–34–0; ఛేజ్ 4–0–35–4; థాంప్సన్ 2–0–31–0; కెవిన్ ఓబ్రైన్ 3–0–36–1; డాక్‌రెల్ 4–0–40–0; సిమి సింగ్ 1–0–12–0; స్టిర్లింగ్ 2–0–16–0.
ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) కుల్దీప్ (బి) బుమ్రా 1; షెనాన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 60; బల్బిర్నీ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 11; సిమి సింగ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 7; విల్సన్ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 5; కెవిన్ ఓబ్రైన్ (సి) ధావన్ (బి) చహల్ 10; థాంప్సన్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 12; పాయింటర్ (బి) కుల్దీప్ 7; డాక్‌రెల్ (బి) బుమ్రా 9; రాన్‌కిన్ (నాటౌట్) 5; ఛేజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–4; 2–45; 3–72; 4–85; 5–96; 6–96; 7–114; 8–123; 9–126.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4–0–16–0; బుమ్రా 4–1–19–2; హార్దిక్ పాండ్యా 4–0–36–0; చహల్ 4–0–38–3; కుల్దీప్ యాదవ్ 4–1–21–4.