Harbhajan Bashes Indian Selectors For Dropping Shikhar Dhawan From ODI Squad - Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?

Published Fri, Apr 7 2023 11:42 AM | Last Updated on Fri, Apr 7 2023 3:43 PM

Harbhajan bashes selectors for dropping Shikhar Dhawan from ODI squad - Sakshi

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌-2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన గబ్బర్‌.. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్‌ 9 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక ఐపీఎల్‌లో అదరగొడుతున్న ధావన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. ధావన్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించాడు. కాగా ధావన్‌ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

                                            

2018 నుంచి టెస్ట్‌లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్‌.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్‌ల్లో గబ్బర్‌ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడని పక్కన పెట్టి, యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇచ్చారు.

ఇదే విషయంపై భజ్జీ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.."ధావన్‌ చాలా సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో సారథిగా ధావన్‌ విజయవంతమయ్యాడు. అయితే ధావన్‌ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశాం. ఇది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి. ధావన్‌ ఒక అద్భుతమైన ఆటగాడు.

అతడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అటువంటి వ్యక్తి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు. ధావన్‌  రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు చాలా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్‌ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు. ధావన్‌కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు.

అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్‌ మ్యాచ్‌లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. అటువంటి ధావన్‌కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటి సమస్య? ఫిట్‌నెస్‌ పరంగా గబ్బర్‌ కూడా కోహ్లిలా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్‌కే చుక్కలు! ఎవరీ సుయాష్‌ శర్మ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement