టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి క్రికెట్ భవిష్యత్తుపై పలు ఊహగానాలు వినిపించాయి.
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతారని, మరి కొందరు ఏకంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటారని జోస్యం చెప్పారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విరాట్, రోహిత్ కచ్చితంగా మరో రెండేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడుతారని భజ్జీ చెప్పుకొచ్చాడు.
"రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఈజీగా మరో రెండేళ్లు పాటు భారత తరపున ఆడగలడు. ఇక విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నాను.
ప్రస్తుత భారత జట్టులో కోహ్లినే అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్. ఫిట్‌నెస్ పరంగా 19 ఏళ్ల యువకుడు కూడా విరాట్‌తో పోటీపడలేడు. కోహ్లి అతడిని ఈజీగా ఓడిస్తాడు. అయితే ఫిట్‌నెస్ ఉన్నప్పటకి క్రికెట్‌లో కొనసాగాలా లేదా అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
నా వరకు అయితే వారు మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ మరి కొన్నేళ్లు కొనసాగాలని ఆశిస్తున్నాని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment