Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో కోహ్లి, నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన గొడవ సీజన్‌కే హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యలో గంభీర్ దూరడంతో ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ గొడవ ఇప్పట్లో సద్దమణిగేలా కనిపించడం లేదు. కోహ్లి ఈ విషయం పెద్దగా పట్టించుకోకపోయినా క్రికెట్ అభిమానులు మాత్రం నవీన్ ఉల్ హక్‌ను టార్గెట్ చేస్తున్నారు.
గొడవ జరిగిన తర్వాత లక్నో ఎక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడినా నవీన్ ఉల్ హక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే వస్తున్నారు. నవీన్ ఉల్ హక్ కూడా అభిమానులనుద్దేశించి వినూత్న గెస్టర్స్‌తో సమాధానం ఇస్తున్నాడు. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ బుధవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ తన చర్యతో మరోసారి హైలెట్ అయ్యాడు.
మ్యాచ్‌లో రోహిత్ శర్మ 11 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా రోహిత్ భారీ షాట్ ఆడగా ఆయుష్ బదోని క్యాచ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వికెట్ తీసుకోగానే తన రెండు చేతులను చెవుల దగ్గర పెట్టి వినిపించడం లేదు అన్నట్లుగా సైగ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసిన నవీన్ ఉల్ హక్.. గ్రీన్‌ను ఔట్ చేసిన సమయంలోనూ ఇదే తరహా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. కోహ్లితో కదా నీ వైరం.. మధ్యలో మా రోహిత్ ఏం చేశాడు అంటూ కామెంట్ చేశారు.
Afghan breakthrough!
— JioCinema (@JioCinema) May 24, 2023
Naveen gets the big wicket of Rohit Sharma in the #TATAIPL #Eliminator 👏#LSGvMI #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/vFl43ZPSuW
చదవండి: ధోని పట్టిందల్లా బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment