
Pollution threat Looms Large on 1st T20 Against IND VS NZ: టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్లో ఆసీస్ చేతి అనుహ్యంగా ఓటమి చెందిన న్యూజిలాండ్.. తదుపరి భారత పర్యటనకు సిద్దమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా నవంబర్17న తొలి టీ20 మ్యాచ్‌లో జైపూర్ వేదికగా భారత్‌తో తలపపడనుంది. అయితే జైపూర్‌లో గత వారం రోజులుగా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే శీతాకాలంలో పొగమంచు కూడా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత కలుషితంగా ఉందని, జైపూర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఈ ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు జైపూర్ చెరుకోగా, కీవిస్ ఆటగాళ్లు సోమవారం(నవంబర్ 15)న చేరుకోనున్నారు. కాగా అంతక ముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా పొగమంచు కారణంగా శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడారు. అప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316 గా నమోదైంది.
చదవండి: ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్
Comments
Please login to add a commentAdd a comment