స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆసీస్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఫ్రెజర్ మెక్‌గర్క్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ ఇంగ్లిష్(42), హెడ్(31), మాథ్యూ షార్ట్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్, రషీద్ చెరో వికెట్ సాధించారు.
లివింగ్ స్టోన్ ఊచకోత..
అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు.
అతడితో పాటు జాకబ్ బితల్(24 బంతుల్లో 44), కెప్టెన్ సాల్ట్(23 బంతుల్లో 39) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ మాథ్యూ షార్ట్ 5 వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. అతడితో పాటు అబాట్ రెండు వికెట్లు సాధించాడు.
మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లైమ్ లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 15న జరగనుంది.
చదవండి: టీమిండియా ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్: గంభీర్, దాదాకు దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment