
భారత్, వెస్టిండీస్ మద్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. దీంతో టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత జట్టు 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు.. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్ ముందు మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. గత మ్యాచ్‌లో చెలరేగిన శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ సింగిల్ డిజిట్ పరుగులకే వెనుదిరిగారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment