ఒక జట్టుకేమో విజయానికి ఒక వికెట్ కావాలి.. అదే సమయంలో అవతలి జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలెండర్. ఈ సమయంలో ఒత్తిడికి లోనయ్యి వికెట్ ఇచ్చుకోవడమో లేక పరుగులు చేయకపోవడమో జరుగుతుంది. అయితే న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ మాత్రం ఒత్తిడిని తట్టుకొని ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు. సూపర్ స్మాష్ టి20 న్యూజిలాండ్ టోర్నీలో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
చదవండి: MS Dhoni: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు
కాంట్‌బర్రీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తన్‌బ్రేవ్స్ ఒక వికెట్‌తో తేడాతో సంచలన విజయం సాధించింది. నార్తన్‌బ్రేవ్ విధించిన 108 పరుగుల లక్ష్యాన్ని కాంట్‌బెర్రీ 20వ ఓవర్ ఆఖరి బంతికి చేధించింది. అప్పటికే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఔటవ్వడంతో ఆఖరి వికెట్‌గా బౌల్ట్ వచ్చాడు. రెండు బంతులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఆఖరి ఓవర్ ఐదో బంతి బౌల్ట్ తలపై నుంచి వెళ్లింది. ఇక చివరి బంతి మంచి టైమింగ్‌తో రావడంతో బౌల్ట్ లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. దీంతో నార్తన్ బ్రేవ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు కాంట్‌బెర్రీ 17.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: వివాదాలకు బ్యాట్‌తోనే కోహ్లి సమాధానం చెబుతాడు.. ఇప్పుడూ అంతే!
TRENT BOULT!!
— Spark Sport (@sparknzsport) December 23, 2021
Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf
Comments
Please login to add a commentAdd a comment