Ind Vs Nz 2021: Rohit Sharma Says Trent Boult Know My Weakness And I Know His Strength - Sakshi
Sakshi News home page

Rohit Sharma: నా వీక్‌నెస్‌ బౌల్ట్‌కు బాగా తెలుసు.. ట్రాప్‌లో పడిపోయా

Published Thu, Nov 18 2021 2:47 PM | Last Updated on Thu, Nov 18 2021 6:09 PM

IND vs NZ: Rohit Sharma Admits Trent Boult Knows My Weakness 1st T20I - Sakshi

Trent Boult Traps Rohit Sharma With Short Ball.. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో సూర్యకుమార్‌ టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే టీమిండియా విజయం దిశగా సాగుతున్న వేళ బౌల్ట్‌ బౌలింగ్‌లో షార్ట్‌బాల్‌ ఆడడంలో విఫలమయ్యి ఔటయ్యాడు. కాగా మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ పోస్ట్‌ ప్రెజంటేషన్‌లో మాట్లాడాడు. 

చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు!

''బౌల్ట్‌కు నా వీక్‌నెస్‌ బాగా తెలుసు. కానీ అతని బలం ఏంటనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. ముంబై ఇండియన్స్‌ తరపున నేను కెప్టెన్‌గా అతనికి అన్ని షార్ట్‌బంతులు విసరమని సలహా ఇచ్చాను. చాలాసార్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు బౌల్ట్‌ అవే షార్ట్‌బాల్స్‌ను నాపై ప్రయోగించాడు.'' అంటూ తెలిపాడు. 

బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో మూడు బంతులు షార్ట్‌ బంతులు వేశాడు.. కానీ  రోహిత్‌ శర్మ 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌల్ట్‌ వేసిన మరో ఓవర్‌లో తొలి బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. అదే తరహాలో మరో షార్ట్‌బంతి వేయగా.. ఈసారి మాత్రం రోహిత్‌ మిస్‌ చేయడంతో షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌, రాహుల్‌ జోడి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement