Bangladesh Vs Pakistan: Shaheen Shah Hurts Afif Hossain In Second T20I - Sakshi
Sakshi News home page

Shaheen Afridi: సిక్స్‌ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్‌?

Published Sat, Nov 20 2021 4:07 PM | Last Updated on Sat, Nov 20 2021 5:01 PM

Ban Vs Pak: Shaheen Shah Hurts Afif Hossain In Second T20I - Sakshi

Shaheen Shah Afridi Hurts Hofif Hossain With Ball..  బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టి20లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది కంట్రోల్‌ తప్పాడు. తన బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టాడని సహించని షాహిన్‌.. బంతితో కసితీరా ప్రత్యర్థి బ్యాటర్‌పైకి విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ హఠాత్పరిణామానికి అంపైర్లు కూడా షాక్‌ అయ్యారు. విషయంలోకి వెళితే.. ఇన్నిం‍గ్స్‌ 3వ ఓవర్‌ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో రెండో బంతిని ఆఫిఫ్‌ హొస్సెన్‌ లెగ్‌స్టంప్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన షాహిన్‌ అఫ్రిది తర్వాతి బంతిని కోపంతో విసిరాడు. అయితే అఫిఫ్‌ డిఫెన్స్‌ ఆడడంతో పరుగు రాలేదు.

అప్పటికే ఆగ్రహంతో ఉన్న షాహిన్‌ బంతిని అందుకొని కసితీరా హొస్సెన్‌ కాళ్లవైపు విసిరాడు. బంతి బలంగా తాకడంతో హొస్సెన్‌ కిందపడి నొప్పితో విలవిల్లాలాడాడు. ఈ చర్యతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాటర్‌తో పాటు అంపైర్లు, పాక్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత షాహిన్‌ హొస్సెన్‌ దగ్గరకు వచ్చి అతన్ని పైకి లేపి సారీ అని చెప్పాడు. అయితే బంగ్లా ఆటగాళ్లు దీనిపై ఫిర్యాదు చేస్తే షాహిన్‌పై చర్యలు ఉండే అవకాశం ఉంది.

చదవండి: BAN vs PAK: హసన్‌ అలీ కవ్వింపు చర్యలు.. బంగ్లాకు షాకిచ్చిన ఐసీసీ

అయితే షాహిన్‌ తీరుపై సోషల్‌ మీడియాలో మాత్రం క్రికెట్‌ అభిమానులు ఏకిపారేశారు. ''కసితీరా కొట్టావు.. సారీ ఎందుకు షాహిన్‌.. మీకింకా టి20 ప్రపంచకప్‌ 2021 కప్‌ గెలవలేదనే మత్తు దిగనట్టుంది.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు సారీ'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. షాంటో 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పాక్‌ బౌలర్ల దాటికి మిగతవారు పెద్దగా రాణించలేకపోయారు. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 12 పరుగులు చేసింది.

చదవండి: రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement