Shoaib Malik Gets Run Out In Bizarre Manner: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టి20లో పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ విచిత్రరీతిలో రనౌట్ అయ్యాడు. బ్యాట్‌ను క్రీజులో పెట్టేందుకు బద్దకించిన మాలిక్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. టాపార్డర్ విఫలమైన చోట బాధ్యతగా బ్యాటింగ్ చేయాల్సిన మాలిక్ ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు.
చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది
విషయంలోకి వెళితే.. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ రూపంలో తొందరగానే వికెట్ కోల్పోయింది. ఈ సందర్భంగా క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో చివరి బంతిని ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. మాలిక్ క్రీజు దాటి బయటికి రావడంతో బంతిని అందుకున్న కీపర్ నురుల్ హసన్ వికెట్ల వైపు విసిరాడు. డైరెక్ట్ హిట్ అవ్వడంతో బెయిల్స్ ఎగిరిపడ్డాయి. అప్పటికే మాలిక్ క్రీజులోకి వచ్చాడని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన మాలిక్ బ్యాట్‌ను మాత్రం కింద పెట్టలేదు. దీంతో బంగ్లా అప్పీల్‌కు వెళ్లగా.. థర్డ్‌అంపైర్ మాలిక్‌ను ఔట్ అని ప్రకటించడంతో డకౌట్‌గా రనౌటయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది.
చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
Shoaib Malik👀pic.twitter.com/MIGoTLXAEn
— CricTracker (@Cricketracker) November 19, 2021
Comments
Please login to add a commentAdd a comment