Hasan Ali Reprimanded For Breaching ICC Code Of Conduct.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని ఐసీసీ మందలించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కవ్వింపు చర్యలకు గాను హసన్ అలీని హెచ్చరించింది. విషయంలోకి వెళితే.. బంగ్లా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హసన్ అలీ.. బంగ్లా బ్యాటర్ నురుల్ హసన్‌ను క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న నురుల్ హసన్‌ను టార్గెట్ చేస్తూ హసన్ అలీ అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ విషయంపై సీరియస్ అయిన ఐసీసీ.. ఆర్టికల్ 2.5 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవల్ 1 నిబంధన ఉల్లఘించిన హసన్ అలీని హెచ్చరికతో సరిపెట్టింది. దీంతోపాటు హసన్ అలీకి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో బంగ్లాకు షాక్ తగిలింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ జట్టు మొత్తం సహా సపోర్ట్ స్టాఫ్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది
Comments
Please login to add a commentAdd a comment