IND vs NZ: Harshal Patel Became Sixth Oldest Player T20I Debutants India- Sakshi
Sakshi News home page

Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్‌ పటేల్‌ కొత్త చరిత్ర

Published Fri, Nov 19 2021 7:35 PM | Last Updated on Fri, Nov 19 2021 9:48 PM

IND vs NZ: Harshal Patel Became Sixth Oldest Player T20I Debutants India - Sakshi

Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరపున హర్షల్‌ పటేల్‌ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్‌ పటేల్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్‌ పటేల్‌ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్‌ అరవింద్‌( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్‌ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్‌( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 

చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్‌

ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడిన హర్షల్‌ పటేల్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్‌ పటేల్‌ అ‍త్యధిక వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్‌ పటేల్‌ డ్వేన్‌ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 

చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement