debutant
-
హీరో, నిర్మాత, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే..
సినిమారంగంపై ఉన్న ఇష్టంతో ముగ్గురు యువ కెరటాలు తమ ప్రతిభను పరిచయం చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. 'వశిష్ట పార్థసారధి'ని దర్శకుడిగా, 'పృథ్విరాజ్'ని హీరోగా పరిచయం చేస్తూ... తాను నిర్మాతగా పరిచయమవుతూ "రవికిరణ్" నిర్మిస్తున్న సినిమా ఆరాధన. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాత కావడం విశేషం. హీరో పృథ్విరాజ్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి... ప్రొడ్యూసర్ రవికిరణ్ సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుండగా... దర్శకుడు వశిష్ట పార్థసారధి "మై ఫ్రెండ్ గాంధి" అనే షార్ట్ ఫిల్మ్ తో తన సత్తాను ఇప్పటికే చాటుకున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట. -
30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర
Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరపున హర్షల్ పటేల్ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్ అరవింద్( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్ ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హర్షల్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది Really nice to see Ajit Agarkar giving the debut cap for Harshal Patel, leading wicket taker in IPL 2021, one of the stars and making the debut for India tonight.pic.twitter.com/ct9QN5I3n0 — Johns. (@CricCrazyJohns) November 19, 2021 -
జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు!
ముంబై:భారత్ తో జరుగుతున్న ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు అంతకుపైన వచ్చి భారత్‌లో 50 పైగా పరుగులు సాధించిన ఇంగ్లిష్ అరంగేట్రం ఆటగాళ్లలో అలెస్టకుక్, ఓవై షా, రూట్, హమిద్లున్నారు. ఈ మ్యాచ్ లో అలెస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ సాగించాడు. అటు భారత పేసర్లను, ఇటు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌కు మంచి పునాది వేశాడు. 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఓవరాల్‌గా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 19వ ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్ సొంతం. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ గుర్తింపు పొందాడు. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడటం విశేషం.