సినిమారంగంపై ఉన్న ఇష్టంతో ముగ్గురు యువ కెరటాలు తమ ప్రతిభను పరిచయం చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. 'వశిష్ట పార్థసారధి'ని దర్శకుడిగా, 'పృథ్విరాజ్'ని హీరోగా పరిచయం చేస్తూ... తాను నిర్మాతగా పరిచయమవుతూ "రవికిరణ్" నిర్మిస్తున్న సినిమా ఆరాధన. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాత కావడం విశేషం. హీరో పృథ్విరాజ్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి... ప్రొడ్యూసర్ రవికిరణ్ సాఫ్ట్‌వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుండగా... దర్శకుడు వశిష్ట పార్థసారధి "మై ఫ్రెండ్ గాంధి" అనే షార్ట్ ఫిల్మ్ తో తన సత్తాను ఇప్పటికే చాటుకున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట.
Comments
Please login to add a commentAdd a comment