బ్రిస్బేన్: తొలి టి20 మ్యాచ్‌లో పరుగుల పరంగా తమ ఖాతాలో అతి పెద్ద విజయం నమోదు చేసుకున్న ఆ్రస్టేలియా... శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ పెరీరా (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), గుణతిలక (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) కాస్త నయమనిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టాన్‌లేక్ (2/23), కమిన్స్ (2/29), అగర్ (2/27), ఆడమ్ జంపా (2/20) రెండేసి వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు.
118 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోయి అధిగమించింది. కెపె్టన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే మలింగ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే వార్నర్ (41 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), స్మిత్ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడారు. రెండో వికెట్‌కు అజేయంగా 117 పరుగులు జోడించారు. వానిందు హసరంగ వేసిన ఐదో ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదాడు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టి20 మ్యాచ్ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment