న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్(55), రాహుల్(65)లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. దీంతో టీమిండియా లక్ష్యాన్ని సులువుగానే చేధించింది. ఆఖర్లో వీరిద్దరు ఔటైనప్పటికి పంత్(12 పరుగులు) వరుసగా రెండు సిక్సర్లతో టీమిండియాను గెలిపించాడు. వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
వరుస బంతుల్లో రెండు వికెట్లు డౌన్.. 17 ఓవర్లలో 140/3
టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రోహిత్ శర్మ(55),సూర్యకుమార్ యాదవ్(1) వెనుదిరిగారు. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ ఫిఫ్టీ.. టీమిండియా 11 ఓవర్లలో 92/0
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో మెరిశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో టి20 కెరీర్‌లో 16వ అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా 31 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.
10 ఓవర్లలో టీమిండియా 79/0
టీమిండియా ఓపెనర్లు రాహుల్(44), రోహిత్ శర్మ(31)లు నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది.
3 ఓవర్లలో టీమిండియా 18/0
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 16, రోహిత్ శర్మ 1 పరుగుతో ఆడుతున్నారు.
►టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులతో పటిష్టంగానే కనిపించిన న్యూజిలాండ్ .. టీమిండియా స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అశ్విన్, అక్షర్ పటేల్‌లు కలిసి 8 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బ్యాటింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గప్టిల్ 31, డారిల్ మిచెల్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2, అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, దీపక్ చహర్ తలా ఒక వికెట్ తీశారు.
18 ఓవర్లలో న్యూజిలాండ్ 140/6
18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సాంట్నర్ 3, మిల్నే 0 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు భువనేశ్వర్ బౌలింగ్‌లో 3 పరుగులు చేసిన నీషమ్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మూడో వికెట్ కోల్పోయిన కివీస్.. గ్లెన్ ఫిలిప్స్(3) ఔట్
డారిల్ మిచెల్(31) రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఫిలిప్స్(3), సీఫెర్ట్ 0 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. 9 ఓవర్లలో 80/2
21 పరుగులు చేసిన మార్క్ చాప్‌మన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
గప్టిల్(31) ఔట్.. 5 ఓవర్లలో న్యూజిలాండ్ 56/1
మార్టిన్ గప్టిల్(31) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చహర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. మిచెల్ 19, చాప్‌మన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో న్యూజిలాండ్ దాటిగా ఆడుతోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. గప్టిల్ 25, మిచెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, హర్షల్ పటేల్
న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment