
ఐస్ క్రికెట్‌లో సెహ్వాగ్ (సోని ఈఎస్‌పీఎన్ ఫొటో)
సెయింట్ మోర్టిజ్: రిటైర్ అయినా వీరూ పవర్ తగ్గలేదు. మామూలు మైదానంలో కాదు ఐస్ స్టేడియంలోనూ సెహ్వాగ్ చెలరేగుతున్నాడు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్టిజ్‌లో జరుగుతున్న ఐస్ టి20 టోర్ని ఆరంభ మ్యాచ్‌లో వీరూ సత్తా చాటాడు. షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని రాయల్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు.
ప్యాలెస్ డైమండ్స్ ఎలెవన్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సెహ్వాగ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు బాదాడు. సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. సైమండ్స్ 40 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన డైమండ్స్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
200 స్ట్రైక్ రేటుతో సెహ్వాగ్ విజృంభించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అతడి ఫొటోలు షేర్ చేసి, కామెంట్లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment