గయానా: అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును యువ ఆటగాడు రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టి20లో టీమిండియా కీపర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పటివరకు ఇదే. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 42 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అయితే టి20ల్లో పంత్ గత అత్యధిక వ్యక్తిగత స్కోరు 58. గతేడాది చెన్నెలో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు. కీపర్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా పంత్ బరిలోకి దిగడంతో ధోని రికార్డు ఇప్పటివరకు ఉంది. భారత్ వికెట్ కీపర్లు టి20ల్లో సాధించిన టాప్-5 స్కోర్లలో నాలుగు ధోని పేరిట ఉండటం విశేషం. (చదవండి: విజయం పరిపూర్ణం)
Comments
Please login to add a commentAdd a comment