నేపియర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు రికార్డుల మోత మోగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టి20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యధిక స్కోరు. డేవిడ్ మలాన్ (51 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (41 బంతుల్లో 91; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 74 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ (15 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మాట్ పార్కిన్సన్‌కు 4 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. చివరి టి20 ఆదివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment