
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడు, భారత క్రికెటర్ అజింక్య రహానే కండరాల గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ టోర్నీతోపాటు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా రహానే గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఫీల్డింగ్ చేయలేదు. రహానే కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్‌లో రహానే ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 133 పరుగులు సాధించాడు.