ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి భారత జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వేర్వేరు నివేదికలు ఇవ్వనున్నారు. బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో వీటిపై చర్చిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు సభ్యులు నివేదికలు పూర్తిగా చదివిన అనంతరం తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 26న ఈ సమావేశం జరగనుంది. టూర్ తొలి భాగంలో కోచ్‌గా ఫ్లెచర్ పూర్తి బాధ్యతలు నెరవేర్చగా, వన్డే సిరీస్ నుంచి శాస్త్రి కూడా జట్టుతో కలిశారు.
11న ఆర్‌సీఏ కేసు విచారణ
బీసీసీఐ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై ఈ నెల 11న జైపూర్ జిల్లా కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. లలిత్ మోడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్‌సీఏ కోర్టును ఆశ్రయించగా... ఆగస్టు 11న దీనిపై కోర్టులో విచారణ కూడా జరిగింది.
వర్కింగ్ కమిటీలో నివేదికలు!
Published Tue, Sep 9 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement