న్యూఢిల్లీ: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు వెంబడి అదనపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ వెళ్లనున్నాడు. బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నా... అతను పర్యటన మధ్యలో గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ ఒకరు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ శ్రీకర్ భరత్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది.
కాగా ఐపీఎల్ టోర్నీలో ఆడే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో కోల్‌కతాలోని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెడతాడు.
చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ
Comments
Please login to add a commentAdd a comment