
పేస్ ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తా: పుజారా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ పెద్దగా రాణించలేకపోతున్న చతేశ్వర్ పుజారా అప్పుడే ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి సారించాడు. జులైలో మొదలయ్యే ఈ సిరీస్‌లో అక్కడి పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రాణించేందుకు రాజ్‌కోట్‌లోని సీమింగ్ ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తానని పుజారా చెప్పాడు. ‘ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులను మనం ఇక్కడ సృష్టించలేం.
అయితే ఐపీఎల్ ముగిశాక రాజ్‌కోట్ స్టేడియంలోని ట్రాక్‌ను దీనికి తగ్గట్టుగా మలుచుకుని ప్రాక్టీస్ చేస్తాను. అయితే ఇప్పటి నుంచే ఆ సిరీస్‌పై ఒత్తిడి పెంచుకోవడం అనవసరం. లీగ్ ముగిశాకే దృష్టి పెడతాను. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆడడమనేది ప్రతీ క్రికెటర్ కల. అయితే నేను ఆ జట్టులో ఉంటానా? లేదా? అనేది చెప్పలేను. బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మెరుగ్గా రాణించగలననే నమ్మకం ఉంది’ అని పుజారా తెలిపాడు.