టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ కానే కాదని.. ఒకవేళ అది నిరూపించుకోవాలంటే తన ముందున్న ఛాలెంజ్‌ను కోహ్లీ అధిగమించాలని హోల్డింగ్ సూచిస్తున్నారు.
‘‘మూడు ఫార్మట్‌లలో కోహ్లి అద్భుతమైన ఆటగాడని అంతా ప్రశంసిస్తుంటారు. కానీ, అది నిరూపించుకోవాలంటే ఇంగ్లాండ్ గడ్డపై అతను పరుగులు సాధించాల్సి ఉంటుంది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. సెంచూరియన్‌లో 153 పరుగులు ఇన్నింగ్స్‌తో కోహ్లి ఆకట్టుకున్నాడు. అయితే గతంలో 2014 ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా కోహ్లి మొత్తంగా విఫలం అయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా అతను సాధించిన సగటు కేవలం కేవలం 13.4 మాత్రమే. ఇన్నేళ్లకు కోహ్లికి మళ్లీ అవకాశం దక్కింది. తానేంటో నిరూపించుకోవాలి’’ అని హోల్డింగ్ తెలిపారు.
కోహ్లి మంచి ఆటగాడని మాత్రమే తానూ ఒప్పుకుంటానని.. ఇంగ్లాండ్ పై రాణిస్తే అతన్ని గొప్ప బ్యాట్సమన్‌గా అంగీకరిస్తానని హోల్డింగ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో ఒకవేళ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కు జాబితాను తయారు చేస్తే కోహ్లితోపాటు, జోయ్ రూట్, స్టీవ్ స్మిత్ పేర్లను తాను ప్రతిపాదిస్తానని ఈ 63 ఏళ్ల కరేబియన్ బౌలింగ్ దిగ్గజం చెబుతున్నారు. కాగా, జూలైలో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనున్న టీమిండియా జట్టు అక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.
మైకెల్ హోల్డింగ్
Comments
Please login to add a commentAdd a comment