ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది.
Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v
— Female Cricket (@imfemalecricket) July 3, 2021
కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment