![Fielder Miss Catch 1st Attempt Saves Ball With-Foot Then Grabs Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/17/Catch%5D.jpg.webp?itok=cna8uixs)
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపించిన సందర్బాలు ఉన్నాయి. ఒక్కోసారి బెస్ట్ ఫీల్డర్ అని చెప్పుకునే ఆటగాళ్లు కూడా క్యాచ్‌లు జారవిడుస్తుంటారు. ఒక్కోసారి ఈజీ క్యాచ్‌లు అందుకునే క్రమంలో చేసే తప్పిదాలు నవ్వును తెప్పిస్తుంటాయి. తాజాగా వీటిన్నింటిని మించిన క్యాచ్.. చరిత్రలో మనం ఎప్పుడు చూడని క్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. విషయంలోకి వెళితే.. విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా.. ఆల్డ్‌విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది.
లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ సమయంలో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్‌కు వచ్చాడు. అతను వేసిన బంతిని బ్యాటర్ షాట్ ఆడే ప్రయత్నంలో గాల్లోకి లేపాడు. దీంతో అలెక్స్ రైడర్ కాట్ అండ్ బౌల్డ్‌తో బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేరుస్తాడని భావించారు. అయితే క్యాచ్ అందుకున్నట్లే అందుకున్న రైడర్ చేతి నుంచి బంతి జారిపోయింది. ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ జరిగింది.
క్యాచ్ అందుకునే క్రమంలో అప్పటికే కింద పడిపోయిన రైడర్ తన కాలును పైకి లేపడం.. అదే సమయంలో బంతి జారి అతని కాలు మీద పడి మళ్లీ గాల్లోకి లేవడం.. ఈసారి రైడర్ ఎలాంటి మిస్టేక్ లేకుండా క్యాచ్ తీసుకోవడం జరిగిపోయాయి. రైడర్ క్యాచ్ అందుకునే చర్యలో బిజీగా ఉన్నప్పుడు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు నోరెళ్లబెట్టి చూడడం విశేషం. మొత్తానికి అలెక్స్ రైడర్ క్యాచ్ అందుకోవడం.. బ్యాటర్ పెవిలియన్ చేరడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్టంప్ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోనూ దట్స్ సో విలేజ్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. 'గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్ ఎవెర్' అంటూ కామెంట్ చేశారు.
The greatest dropped catch ever!? 😂
— That’s so Village (@ThatsSoVillage) June 16, 2022
Brilliant clip from @AldwickCC's stump cam! pic.twitter.com/Cpmd80QdGP
చదవండి: క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా
Comments
Please login to add a commentAdd a comment