లండన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్ పర్యటన ముగించుకుని టర్కీ బయల్దేరారు. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే 20 సదస్సులో ఆయన పాల్గొంటారు. రెండు దేశాలతో ధ్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం చర్చలు జరుపనున్నట్టు సమాచారం.
కాగా బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తో లంచ్, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇక మూడోరోజు మోదీ జాగ్వర్ లాండ్‌రోవర్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఆయన టర్కీకి బయల్దేరారు. ఈ నెల 16వ తేదీ వరకూ మోదీ విదేశీ పర్యటన కొనసాగనుంది.