కెప్టెన్సీకి ధోని గుడ్ బై? | 'Wait and watch', Dhoni says on queries on quitting captaincy | Sakshi

కెప్టెన్సీకి ధోని గుడ్ బై?

Aug 18 2014 1:00 PM | Updated on Sep 2 2017 12:04 PM

కెప్టెన్సీకి ధోని గుడ్ బై?

కెప్టెన్సీకి ధోని గుడ్ బై?

ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహించి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా అనే ప్రశ్నలు మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి

లండన్: ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహించి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా అనే ప్రశ్నలు మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టు 1-3 తేడాతో ఘోర పరాజయం పొందిన తర్వాత ధోని కెప్టెన్సీపై అనేక సందేహాల్ని క్రికెటర్లు, భారత క్రికెట్ అభిమానులు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. 
 
అందుకనుగుణంగానే ధోని కూడా కెప్టెన్సీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ పదవిని వదులుకుంటున్నారా అనే ప్రశ్నకు వేచి చూడండి అనే సమాధానాన్ని ధోని నోటి వెంట వచ్చింది. వరుసగా ఐదు ఇన్నింగ్స్ ల్లో భారత బ్యాట్స్ మెన్ లు ఘోరంగా విఫలమవ్వడంపై ధోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement