ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె | AP contributed greatly to the development of | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె

Published Thu, Nov 13 2014 1:01 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె - Sakshi

ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె

తన ఇంగ్లండ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తన ఇంగ్లండ్ పర్యటనపై మంత్రి పల్లె
సాక్షి, హైదరాబాద్: తన ఇంగ్లండ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న మంత్రి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తన పర్యటనలో.. వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు, ఇండో-బ్రిటన్ బంధం, అవినీతిపై చర్యలు, అక్కడి పార్లమెంటు, అసెంబ్లీల పనితీరుపై అధ్యయనం చేసినట్లు మంత్రి వివరించారు. 16 ఐటీ, ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. విజయవాడ, తిరుపతి, అనంతపురం, గుంటూరులలో ఐటీ రంగం అభివృద్ధికి ఈ కంపెనీలన్నీ కృషి చేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement