
ఇంగ్లండ్ పర్యటనకు అజింక్య రహానేను కాదని అంబటి రాయుడును వన్డే జట్టులోకి ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. స్వింగ్ పిచ్‌లపై అతని ఆటతీరు చక్కగా సరిపోతుందని అలాంటిది అతన్ని కాదని రాయుడు ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ అంశంపై గంగూలీ స్పందిస్తూ... ‘నేనైతే రాయుడు కంటే ముందు రహానేను తీసుకునేవాడిని. ఇంగ్లండ్ గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. అలాంటిది అతడిని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం కఠిన నిర్ణయమే’ అని తెలిపాడు.