
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, రోహిత్, పుజరా వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. రహానే తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు.
129 బంతుల్లో 89 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక రీ ఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానేపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. రహానే మాత్రం పోరాట పటిమ కనబరిచాడని దాదా కొనియాడాడు.
"రహానే 18 నెలల పాటు అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే రహానే ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంది అతడి కెరీర్ ముగిపోయిందని భావించారు. నిజానికి రహానే కూడా అదే అనుకుని ఉంటాడు. భారత్ క్రికెట్‌లో ఒక బ్యాటర్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు.
రహానే రీ ఎంట్రీ మాత్రం అద్భుతం. గతంలో చాలా మంది ఆటగాళ్లు కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రహానే వంటి రీ ఎంట్రీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతడు మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు అని స్టార్‌స్పోర్ట్స్ షోలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment