
సేనానాయకేపై నిషేధం
కొలంబో: వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేపై ఐసీసీ నిషేధం విధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
మేలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో సేనానాయకే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ శైలిని ప్రదర్శించాడని రుజువైంది. ఈమేరకు ఐసీసీ బౌలింగ్ యాక్షన్ లీగల్టీ అసెస్‌మెంట్ నివేదిక లంక బోర్డుకు అందింది. 29 ఏళ్ల సేనానాయకే ఒక టెస్టు, 37 వన్డేలు, 17 టి20లు ఆడాడు. ఓవరాల్‌గా 58 వికెట్లు తీశాడు.