రాణించిన రషీద్, కరణ్‌ | Hyderabad team was all out for 301 runs | Sakshi
Sakshi News home page

రాణించిన రషీద్, కరణ్‌

Published Fri, Nov 15 2024 4:02 AM | Last Updated on Fri, Nov 15 2024 4:03 AM

Hyderabad team was all out for 301 runs

ఆంధ్ర 168/2 

హైదరాబాద్‌ 301 ఆలౌట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 244/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు చివరకు 105.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (287 బంతుల్లో 159; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించాడు. 

వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాదేశ్‌ (22) క్రితం రోజు స్కోరు వద్దే అవుట్‌ కాగా.. చామా మిలింద్‌ (5), తనయ్‌ త్యాగరాజన్‌ (10), అనికేత్‌ రెడ్డి (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్‌ 5, మొహమ్మద్‌ రఫీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

కెప్టెన్ షేక్‌ రషీద్‌ (161 బంతుల్లో 79 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కరణ్‌ షిండే (41 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), అభిషేక్‌ రెడ్డి (38; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) బాధ్యతాయుతంగా ఆడారు. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి, అనికేత్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. రషీద్‌తో పాటు కరణ్‌ షిండే క్రీజులో ఉన్నాడు.  

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) సందీప్‌ (బి) రఫీ 124; అభిరత్‌ రెడ్డి (సి) మోహన్‌ (బి) విజయ్‌ 35; రోహిత్‌ రాయుడు (సి) (సబ్‌) జ్ఞానేశ్వర్‌ (బి) విజయ్‌ 0; హిమతేజ (సి) భరత్‌ (బి) సందీప్‌ 36; రాహుల్‌ సింగ్‌ (సి అండ్‌ బి) విజయ్‌ 1; నితీశ్‌ రెడ్డి (స్టంప్డ్‌) భరత్‌ (బి) మోహన్‌ 22; రాహుల్‌ రాదేశ్‌ (ఎల్బీ) (బి) శశికాంత్‌ 22; మిలింద్‌ (బి) విజయ్‌ 5; తనయ్‌ (సి) రషీద్‌ (బి) విజయ్‌ 10; అనికేత్‌ రెడ్డి (సి) భరత్‌ (బి) రఫీ 7; రక్షణ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్‌) 301. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, 6–245, 7–253, 8–265, 9–288, 10–301. బౌలింగ్‌: శశికాంత్‌ 19–4–38–1; రఫీ 24.4–4–5–59–2; విజయ్‌ 31–5–118–5; లలిత్‌ మోహన్‌ 23–4–64–1; సందీప్‌ 8–0–18–1. 
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: హేమంత్‌ (సి) నితీశ్‌ (బి) రక్షణ్‌ 9; అభిషేక్‌ రెడ్డి (బి) అనికేత్‌ రెడ్డి 38; షేక్‌ రషీద్‌ (బ్యాటింగ్‌) 79; కరణ్‌ షిండే (బ్యాటింగ్‌) 41; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (58 ఓవర్లలో 2 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–17, 2–84, బౌలింగ్‌: మిలింద్‌ 8–2–21–0; రక్షణ్‌ రెడ్డి 10–0–35–1; అనికేత్‌ రెడ్డి 22–5–56–1; తనయ్‌ త్యాగరాజన్‌ 9–0–39–0; రోహిత్‌ రాయుడు 9–2–16–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement