వైఎస్సార్‌సీపీలో చురుగ్గా తిరిగాడనే టీడీపీ నేతలు చంపించారు
రషీద్‌కు నేర చరిత్ర లేదు.. పాత కక్షలు లేవు
రషీద్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కి లేదా?
పోలీసులు జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారు?
రషీద్ తల్లి బడేబీ, తండ్రి ఫరేషా
సాక్షి, నరసరావుపేట: వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అతని తల్లి బడేబీ, తండ్రి ఫరేషా స్పష్టం చేశారు. ‘మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు. నేర చరిత్ర లేదు. ఎవరినీ చంపలేదు, నరకలేదు. కేవలం వైఎస్సార్‌సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడన్న కారణంతోనే టీడీపీ నేతలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. ఇందుకు జిలానీని అడ్డుపెట్టుకొన్నారు. బుల్లెట్ బండి తగలబెట్టడానికి, మా కుమారుడికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా చెబుతారు’ అని చెప్పారు.
జగన్‌ను ఎందుకు అడ్డుకున్నారు?
తన పార్టీ కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నేతలు హత్య చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారని ప్రశి్నంచారు. ‘రషీద్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదా? ప్లకార్డులను ఎందుకు చింపేశారు? జగన్ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు. మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందని కదా’ అని అన్నారు. కొడుకును కోల్పోయి బాధలో ఉన్న తమకు వైఎస్ జగన్ భరోసానిచ్చారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు.
తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచారు. ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా నలుగురు ఉన్నారు, మిమ్మల్నీ చంపుతామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు. పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కోరారు. ‘ఆమె ఎవరో హోంశాఖ మంత్రి అనిత అంట.. ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! పాత కక్షలు, ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె చెప్పడం సరికాదు.
మా కడుపు కోతను అర్థం చేసుకొని మరోసారి పాతకక్షల వల్ల హత్య అని అనవద్దు. మాకు న్యాయం చేయండి’ అని అన్నారు. బొండాలు కొట్టే కత్తితో రషీద్‌ను హత్య చేశారని అంటున్నారని, ఆ కత్తిని ఎందుకు చూపడంలేదని ప్రశి్నంచారు. అది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment