శెట్టూరు మండలంలోని ప్రభుత్వ హైస్కూలులో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రషీద్‌ను తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శెట్టూరులో ఆందోళన నిర్వహించారు.
శెట్టూరు మండలంలోని ప్రభుత్వ హైస్కూలులో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రషీద్‌ను తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శెట్టూరులో ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని పలుమార్లు చెప్పినా పెడచెవిన పెట్టాడని దీని వల్ల అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు తెలిపారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీఓ వచ్చి, నిర్వాహకుడిని తొలగిస్తామని తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.