
రషీద్ (ఫైల్)
సాక్షి, తాడిపత్రి: ఎల్లో డాన్ కేవీ రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. రషీద్.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉంటూ పట్టణంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోనూ పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తుండేవాడు. 2018 డిసెంబర్ 30వ తేదీన రషీద్‌ను అరెస్టు చేసేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన అప్పటి సీఐ హమీద్‌ఖాన్ తన సిబ్బందితో కలిసి తాడిపత్రికి చేరుకున్నారు.
అయితే అతనితో పాటు అనుచరులు సీఐ హమీద్‌ఖాన్, ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రషీద్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై విడుదలైన రషీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. (జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం)
Comments
Please login to add a commentAdd a comment