డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్ | ITDA officer suspension | Sakshi
Sakshi News home page

డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్

Published Sun, Dec 22 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

ITDA officer suspension

ఉట్నూర్, న్యూస్‌లైన్ :  ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఏ.రషీద్‌ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.విద్యాసాగర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఈ నెల 18న పత్రిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేదని, గతంలో సస్పెండైన గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఐటీడీఏ ఎదుట మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి శనివారం రషీద్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. విధి నిర్వహణలో బాధ్యతరాహిత్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకపోవడం, రూల్ 3 ఆఫ్ సీసీఎల్ 1991కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ధర్నాలో పాల్గొనడం, ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం తదితర చర్యలకు పాల్పడినందుకు జీవో నంబర్  274 ప్రకారం రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement