దొంగలు ఎత్తుకెళ్లిన పోలీసు వ్యాన్ (నమూనా చిత్రం)
సాక్షి, భోపాల్ : పోలీసులే దొంగలను పట్టుకోవడం సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ, పోలీసులనే దొంగలు పట్టుకుంటే.. అది కూడా పక్కా ప్రణాళిక ప్రకారం వారిని పిలిచి మరీ ఆ పనిచేస్తే.. అవాక్కవడం తప్ప ఆ పోలీసులు చేసేదేం ఉండదు. మధ్యప్రదేశ్‌లో అదే జరిగింది. అచ్చం సినిమాల్లో మాదిరిగానే కొంతమంది దోపిడీ దొంగలు ఏకంగా పోలీసులనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్నాం కాపాడండి అంటూ ఫోన్ చేసి పిలిచి వచ్చి రాగానే వారికి గన్ గురిపెట్టి వాహనం ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఓ బాలికను కిడ్నాప్ కూడా చేశారు.
వివరాల్లోకి వెళితే పన్నా జిల్లాలో ఆదివారం ఉదయాన్నే ఓ వ్యక్తి గందరగోళం సృష్టిస్తున్నాడనే వచ్చి వెంటనే రక్షణ కల్పించాలని పోలీసులకు 100 ద్వారా అమంగాంగ్ మండల పరధిలోని బామురహా అనే గ్రామం నుంచి ఫోన్ చేశారు. దీంతో ప్రకాశ్ మండల్ అనే ఓ హెడ్ కానిస్టేబుల్, సుభాష్ దుబే అనే ఎస్‌పీఎఫ్ జవాన్ కలిసి పోలీసు వాహనం తీసుకొని హుటాహుటిన అక్కడి వెళ్లారు. వారు వెళ్లే చూసే సరికి ఓ వ్యక్తి రోడ్డుపై ముఖం కనిపించకుండా పడి ఉన్నాడు. వారు దగ్గరకు వెళ్లే చూసే సరికి వెంటనే లేచి తుపాకీ గురిపెట్టాడు. అతడికి మరో నలుగురు దుండగులు తోడయ్యారు. అందరు కలిసి ఆ పోలీసులను బందించడమే కాకుండా వారి దుస్తులను విప్పించారు.
అనంతరం ఓ డ్రైవర్‌తో సహా ఇద్దరు పోలీసుల చేతులు, కాళ్లు కట్టేసి మరో కారులో పడేశారు. అనంతరం వారి దుస్తులు వేసుకొని అదే వాహనంలో బామురహా గ్రామానికి వెళ్లారు. ఓ లైంగిక వేధింపుల కేసులో ఓ యువతిని స్టేషన్‌కు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకురావాలని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతి తండ్రిని, బాబాయిని, ఆ యువతిని 100 వాహనంలో ఎక్కించారు. ఆ తర్వాత వెళ్లిపోయే క్రమంలో ఆ యువతి తండ్రిని, బాబాయ్‌ను బలవంతంగా కిందకు దించేసి పోలీసులను బంధించిన వాహనం వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసులకు తిరిగి దుస్తులు ఇచ్చేసి వేగంగా ఆ యువతిని తీసుకొని పరార్ అయ్యారు. వారికోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment