
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో పులివెందుల నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగ్ సందర్భంగానే వీరంగం సృష్టించారు. అటుగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చినా పోలీసులపైనా దాడికి యత్నించారు.
దాడికి యత్నించింది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) అనుచరులుగా తేలింది. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. మరోవైపు పోలీసుల విజ్ఞప్తితో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment