సాక్షి, వైఎస్సార్: తెలుగు దేశం పార్టీ నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో రవి తన అనుచరులతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మారణాయుధాలతో ఓ వెంచర్‌పై దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఈ దాడిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో.. రవి ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆదివారం వంద మందికి పైగా అనుచరులతో, మారణాయుధాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన రవి.. ఆపై అక్కడి ఫెన్సింగ్‌ను అన్యాయంగా తొలగించాడు కూడా. ఈ ఘటనపై ఆ వెంచర్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర వెంచర్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, రవి దగ్గర అలాంటి ఆధారాలు ఎవైనా ఉంటే చూపించాలని రవికి సూచించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు.. చక్రాయపేట దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీటెక్ రవి ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.
సంబంధిత వార్త: యెల్లో బ్యాచ్ దౌర్జన్యకాండ.. చక్రాయపేటలో ఏం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment