rowdy Attacks
-
ఏపీలో రౌడీ రాజ్యం: జూపూడి ప్రభాకర్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రౌడీరాజ్యం కొనసాగుతోందని, రౌడీలు,రాజకీయ నాయకులు కలిసి జనానికి చుక్కలు చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జూపూడి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కాకినాడ టౌన్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే నానాజి రాద్దాంతం చేశారు.నానాజీ మీద పదకొండు కేసులున్నాయి.అలాంటి రౌడీని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?రంగరాయ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అలాంటి కాలేజీలో ప్రొఫెసర్లను,అమ్మాయిలను ఎమ్మెల్యే మనుషులు వేధిస్తున్నారు.దీనిపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తే ఆయనపై దాడి చేశారు.రౌడీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు స్టూడెండ్స్ డిమాండ్ చేస్తున్నారు.ఒక ఎస్సీ డాక్టర్‌ను పచ్చి బూతులతో ఎమ్మెల్యే దూషించారు.దళితులు కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు జాగ్రత్త.కలెక్టర్,ఎస్పీ కలిసి ఈ కేసును రాజీ చేస్తున్నారు.ఆ అధికారులు ఇలాంటి పనులు చేయడడానికే ఉన్నారా?దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఏం చేస్తున్నారు?మంత్రి సత్యకుమార్ కూడా ఒకప్పుడు రౌడీనే.డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆత్మగౌరవానికి భంగం కలిగింది.దానికి తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ప్రజలు ఆగ్రహిస్తే నానాజీ లాంటి తురుమ్ఖాన్లు కనుమరుగు అవుతారు.జనం నిలదీసేసరికి ప్రాయచ్చితదీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేసే ఉద్యమానికి దళిత సంఘాలు మద్దతిస్తాయి.రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తగులపెట్టారు.రఘురామకృష్ణంరాజు దళితులకు క్షమాపణలు చెప్పాలి.దళితులంతా ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నారు.దళితులంతా వైసీపికి మద్దతు ఇస్తున్నందుకు కక్ష కట్టారు.ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు.ఏం సాధించారని వంద రోజుల పండుగ చేసుకుంటున్నారు?ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కేసును సుమోటోగా తీసుకుని విచారించాలి.దళిత ఉద్యోగులకు సరైన పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు.టీటీడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’అని జూపూడి హెచ్చరించారు.ఇదీ చదవండి: పవన్ ప్రాయశ్చిత్తం అసలు దేనికోసం -
B Tech Ravi: అజ్ఞాతంలోకి బీటెక్ రవి
సాక్షి, వైఎస్సార్: తెలుగు దేశం పార్టీ నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో రవి తన అనుచరులతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మారణాయుధాలతో ఓ వెంచర్‌పై దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఈ దాడిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో.. రవి ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం వంద మందికి పైగా అనుచరులతో, మారణాయుధాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన రవి.. ఆపై అక్కడి ఫెన్సింగ్‌ను అన్యాయంగా తొలగించాడు కూడా. ఈ ఘటనపై ఆ వెంచర్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర వెంచర్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, రవి దగ్గర అలాంటి ఆధారాలు ఎవైనా ఉంటే చూపించాలని రవికి సూచించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. చక్రాయపేట దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీటెక్ రవి ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. సంబంధిత వార్త: యెల్లో బ్యాచ్ దౌర్జన్యకాండ.. చక్రాయపేటలో ఏం జరిగిందంటే.. -
బందరులో టీడీపీ రౌడీ రాజకీయం
మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా బందరు మండలంలో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి సంబంధించి 12 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండల పరిధిలోని గరాలదిబ్బలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు తరచూ గొడవలకు దిగేవారు. పలుమార్లు ఘర్షణలు జరిగి కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి ఒడుగు రాజ్‌కుమార్ బైక్‌పై వెళ్తున్నాడు. బహిర్భూమికి వెళ్లిన బొడ్డు నాగరాజు అటుగా వెళ్తుండగా అలికిడి వినిపించి రాజ్‌కుమార్ బైక్ లైట్‌ని అటువైపుగా తిప్పాడు. బహిర్భూమికి వస్తే నావైపు బైక్ లైట్ వేస్తావా? అంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. పాతకక్షలను మనసులో పెట్టుకున్న నాగరాజు తన వర్గీయులతో ఆదివారం రాత్రి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో రాజ్‌కుమార్, ఆయన వర్గీయులపై దాడికి తెగబడ్డారు. మహిళలు, చిన్న పిల్లలని కూడా చూడకుండా రెచ్చిపోయినట్లు స్థానికులు చెప్పారు. నిరీక్షణరావు (24) భోజనం చేస్తుండగానే టీడీపీ శ్రేణులు బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. అదే విధంగా ఒడుగు నాగరాజు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ గాయాలపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో నిరీక్షణరావును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. దాడికి పాల్పడిన బొడ్డు వీరవెంకటేశ్వరరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్నా), బొడ్డు దుర్గారావు, బొడ్డు నాగేశ్వరరావు, బొడ్డు బాల, బొడ్డు నాగరాజు, బొడ్డు ఏసురాజు, బొడ్డు వెంకటేశ్వరరావు (వెంకన్న), బొడ్డు ఏడుకొండలు (చంటి), బొడ్డు అభిరామ్ (రాజు), బొడ్డు వేణుగోపాలరావు (వేణు), బొడ్డు మోషేరాజుపై సెక్షన్ 307, 148, 143, 149 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ జి.వాసు వెల్లడించారు. -
తప్పతాగి యువకుడు రౌడీయిజం.. మహిళ ఏం చేసిందో చూడండి?
సాక్షి, విశాఖపట్నం: పరిస్థితి చేజారి పోతే మనిషిలో కొత్త శక్తి బయటకు వస్తుంది అది ఆడ కావచ్చు మగ కావచ్చు... నిస్సహాయులు కావచ్చు. ఈ క్రమంలోనే తప్పతాగి తిక్క వేషాలు వేసిన ఓ అకతాయికి తిక్క కుదిర్చిందో ఓ మహిళ. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీల ఆగడాలు నిత్యం కనిపిస్తుంటాయి. పేదరికం తో పాటు నగర శివారు ప్రాంతం కావడంతో ఆకతాయిలు రౌడీ మూకలు అమాయకులను బెదిరిస్తున్నారు. అలా ఆరిలోవ లో క్రాంతి నగర్ లో ఓ మహిళ దుకాణం వద్దకు రామకృష్ణ అనే యువకుడు వెళ్లాడు. అక్కడకి వెళ్లి ఆమెపై దుర్భాష లాడి రౌడీయిజం చెలాయించాడు. ఆ మహిళపై పై చేయు చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ యువకుడిపై తిరగబడింది.. చేతికి చిక్కిన రౌడిని నాలుగు దెబ్బలు తగిలించింది. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్నవాళ్లు మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు విశాఖలో వైరల్అవుతోంది. పోలీసులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. కాగా ఇటీవల విశాఖ నగర శివారులో ఇలాంటి అల్లరిమూకల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రౌడీ బుద్ధి చెప్పిన మహిళ తెగువను ప్రశంసిస్తున్నారు. -
గ్యాంగ్‌వార్
గుంటూరు రౌడీల గ్యాంగ్‌వార్ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరం మళ్లీ రౌడీషీటర్ల ఆధిపత్య పోరుతో అట్టుడుకుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కిరాతక హత్యలకు కూడా వెనుకాడకపోవడంతో నడిరోడ్డుపై రక్తచారికలు తరచూ కన్పిస్తున్నాయి. దీనికి ఆదివారం రాత్రి అరండల్‌పేటలో జరిగిన రౌడీషీటర్ వాసు హత్యే ఓ ఉదాహరణ. ఒక ఏడాది ముగిసేలోపే 10 హత్యలు జరిగాయంటే హింస తీవ్రత ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గ్యాంగ్‌వార్‌తో ప్రజాజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందే. సినీఫక్కీలో పక్కా స్కెచ్... గుంటూరు నగరం. రద్దీగా ఉండే అరండల్‌పేట ప్రాంతం. 12వ లైను. ఆదివారం రాత్రి 8.26 గంటల సమయంలో వందలాది మంది జనం చూస్తుండగా అన్వర్ బిర్యానీ పాయింట్ ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ బసవల భారతి వాసును ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. సినీఫక్కీలో స్కార్పియో వాహనంతో ఢీకొట్టి కిందపడిపోయిన వాసుపై ఐదుగురు వ్యక్తులు 30 సెకన్లలో 30 కత్తి పోట్లు పొడిచారు. ఘటనతో అక్కడ ఉన్న ప్రజలంతా కేకలు పెడుతూ పరుగులు తీశారు. అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య జరగడం చూస్తుంటే హంతకులకు పోలీసులంటే ఏమాత్రం భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తపు చారికలెన్నో.. ⇒ గతేడాది డిసెంబరులో గుంటూరు అరండల్‌పేట 3/2లోని ఓ హోటల్ ఎదురుగా రాత్రి 8 గంటల సమయంలో రౌడీషీటర్ బొప్పన రవిని నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ⇒ 2016 డిసెంబరులో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వల్లపు గోపి అనే వ్యక్తిని నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎదురుగా ఆటోలో గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఎక్కించి గుంటూరు రూరల్ మండలం బుడంపాడు కాలువ వరకూ తీసుకెళ్లి హతమార్చారు. ఆదిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగినట్లు పోలుసులు గుర్తించారు. ⇒ ఈ మార్చి 6న నాగెండ్ల కల్యాణ్‌రామ్ అనే యువకుడిని ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు మట్టుపెట్టారు. ⇒ కొన్నాళ్ల కిత్రం గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో ఆగంతకులు ముగ్గురు యువకులను దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. ⇒ మూడు నెలల క్రితం ఆంజనేయులు అనే రౌడీషీటర్ని ఏటుకూరు రోడ్డులోని చాకలికుంట సెంటర్లో ప్రత్యర్థులు నరికి చంపారు. ఇలా ఒక్క ఏడాదిలో 10 హత్యలు జరిగాయి. చోటా అనుచరులతో సెటిల్మెంట్లు.. గతంలో లిస్టులో మోస్ట్ వాంటెడ్‌గా రౌడీషీటర్లు బయటకు రాకుండా ఇప్పుడు చోటా అనుచరులకు బాధ్యతలు అప్పగించి వారిచేత సెటిల్మెంట్లు చేయిస్తున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని పాతగుంటూరు, శ్రీనివాసరావుపేట వంటి ప్రాంతాల్లో హవా కొనసాగిస్తున్న రౌడీ షీటర్లు అధికార పార్టీ నాయకులతో తప్పించుకు తిరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. రౌడీషీటర్లు మాత్రం తమను పోలీస్ స్టేషన్లకు పిలిపించరాదంటూ అధికార పార్టీ నేతలతో పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కొందరు వైట్‌కాలర్ నేరస్థులైతే తమకు ప్రాణహాని ఉందని లైసెన్స్డ్ గన్ తీసుకునేపనిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతివారం రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిచి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి కదలికలపై పూర్తి నిఘా ఉంచాల్సిన పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి అని వేరే చెప్పనక్కర్లేదు. రౌడీషీటర్ల నగరం నుంచి బహిష్కరిస్తాం.. రౌడీషీటర్ బసవల వాసు హత్య ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని డీఎస్పీలు, సీఐలతో అత్యవసర సమావేశం నిర్వహించాం. రౌడీషీటర్ల భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేశాం. వారం రోజుల్లో నగరంలో రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేస్తాం. వారిని నగరం నుంచి బహిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నాం. సెటిల్మెంట్లు, దందాలు ఎవరినీ ఉపేక్షించం. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించాం. శాంతి భద్రతల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటాం. రౌడీషీటర్లను కట్టడి చేసి నేరాల పని పడతాం. – అర్బన్ ఎస్పీ విజయారావు -
పోలీసుల దూకుడు
అమలాపురంలో రౌడీమూకలపై గురి ఆరు రౌడీ గ్యాంగ్‌ల గుర్తింపు త్వరలో 40 మందిపై రౌడీషీట్లు తెరిచే అవకాశం అమలాపురం టౌన్ : కోనసీమ కేంద్రమైన అమలాపురం రౌడీలకు అడ్డాగా మారుతోంది. పచ్చని సీమలో పగలు ప్రతీకారాలు, దాడులు ప్రతిదాడులు, అధిపత్యపోరు పెరిగిపోతోంది. దీంతో పోలీసులు రౌడీమూకలకు ముకుతాడు వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రౌడీలను కటకటాల్లోకి నెడుతున్నారు. గతంలో అమలాపురం పట్టణంలో రెండు ప్రధాన సామాజికవర్గాల గొడవలు జరిగేవి. తరచూ ఇరువర్గాలు కవ్వించు చర్యలకు పాల్పడేవి. ఆ రెండు వర్గాల నుంచి గత రెండు దశాబ్దాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇలాంటి వర్గ వైషమ్యాలను ప్రోత్సహించకుండా వాటిని దూరం చేశారు. అయితే ఇప్పుడు పట్టణానికి రౌడీయిజం అనే రోగం పట్టుకుంది. ఓ సామాజిక వర్గం నుంచి పుట్టిన ఆకు రౌడీలను పోలీసులు ఆదిలోనే అదుపు చేయలేదు. వారి వెనుక రాజకీయ అండ ఉందన్న కారణంతో వారి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు వారే ఏకు మేకులయ్యారు. పట్టణేతర ప్రజాప్రతినిధి ఒకరు, ఆయన పేరుచెప్పుకుని ఓ సోదరుడు, ఆయనకు సంబంధించిన కొందరు అనుచరులు రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్నారన్న సమాచారం ఇంటిలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరింది. ఆరు రౌడీ గ్యాంగ్‌ల గుర్తింపు ఇంటిలిజెన్స్ నివేదికతో అమలాపురం పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో రౌడీయిజం పీచుమనిచేందుకు సిద్ధమయ్యారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ప్రైవేటు సెటిల్మెంట్లు, దాడులకు వ్యూహాలు, ఆయుధాలతో కుట్రలు పన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై దృష్టిపెట్టారు. ఇలా 70 మంది రౌడీ మూకలను టార్గెట్ చేశారు. వీరంతా ఆరు రౌడీ గ్యాంగులుగా ఉండి పనులు సాగిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లపై పోలీసులు కేసులు షురూ చేశారు. దీంతో అమలాపురంలోని బడా రౌడీలు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ముందుగా చోటా రౌడీబ్యాచ్లను అరెస్టు చేసుకుంటూ వస్తున్నారు. గ్యాంగ్లీడర్లగా వ్యవహరిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనిచేయని పైరవీలు పోలీసులు దూకుడు చూసి భయపడి గ్యాంగ్‌లీడర్లు ఎప్పటిలాగే తమ రాజకీయ బాసులను ఆశ్రయించారు. అయితే ఇప్పుడు వారిని కాపాడే పరిస్థితి అండగా ఆ ప్రజాప్రతినిధికి లేకుండా పోయింది. దీంతో రౌడీల పని అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరినొకరిపై ఈ విషయమై ఫిర్యాదులు చేసుకుంటూ ఆ పంచాయతీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. యువకులే ఎక్కువ ఈ ఆరు రౌడీ గ్యాంగుల్లో మొత్తం 70 మంది రౌడీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 50 మంది వరకూ 20 నుంచి 25 ఏళ్లు ఉన్న యువకులే. ఇందులో దాదాపు 40 మంది యువకులు తరచూ ఏదో వివాదాల్లో ఉండటం... ఏదో కేసుల్లో ఉండటం వంటి పరిణామాలతో వారిని ఆదిలోనే అదుపు చేసేందుకు వారిపై కొత్తగా రౌడీషీట్లు తెరవాలని పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఫైలు కూడా పోలీసు ఉన్నతాధికారుల పరిశీలనతో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ అమలాపురానికి చెందిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై మిశ్రమ ప్రభావాలు చూపుతున్నాయి. గతంలో అమలాపురానికి ఏ ప్రజాప్రతినిధి ఎన్నికైనా... మంత్రి పదవి వచ్చినా రౌడీలపై ఉక్కుపాదం ఇంతలా ఎప్పుడూ మోపలేదు. రాజప్ప వచ్చిన తర్వాతే రౌడీలపై పోలీసుల దూకుడు ఎక్కువవటంతో రౌడీలు, వారి కుటుంబాల వారు ఆయనపై కారాలు నూరుతున్నారు.