ఏపీలో రౌడీ రాజ్యం: జూపూడి ప్రభాకర్‌ | Ysrcp Leader Jupudi Prabhakarrao Comments On Pantam Nanaji | Sakshi
Sakshi News home page

ఏపీలో రౌడీల రాజ్యం నడుస్తోంది: జూపూడి ప్రభాకర్‌

Published Mon, Sep 23 2024 3:13 PM | Last Updated on Mon, Sep 23 2024 3:23 PM

Ysrcp Leader Jupudi Prabhakarrao Comments On Pantam Nanaji

సాక్షి,తాడేపల్లి: ఏపీలో రౌడీరాజ్యం కొనసాగుతోందని, రౌడీలు,రాజకీయ నాయకులు కలిసి జనానికి చుక్కలు చూపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో జూపూడి సోమవారం(సెప్టెంబర్‌23) మీడియాతో మాట్లాడారు.

‘కాకినాడ టౌన్‌లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే నానాజి రాద్దాంతం చేశారు.నానాజీ మీద పదకొండు కేసులున్నాయి.అలాంటి రౌడీని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?రంగరాయ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అలాంటి కాలేజీలో ప్రొఫెసర్లను,అమ్మాయిలను ఎమ్మెల్యే మనుషులు వేధిస్తున్నారు.దీనిపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తే ఆయనపై దాడి చేశారు.

రౌడీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు స్టూడెండ్స్ డిమాండ్‌ చేస్తున్నారు.ఒక ఎస్సీ డాక్టర్‌ను పచ్చి బూతులతో ఎమ్మెల్యే దూషించారు.దళితులు కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు జాగ్రత్త.కలెక్టర్,ఎస్పీ కలిసి ఈ కేసును రాజీ చేస్తున్నారు.ఆ అధికారులు ఇలాంటి పనులు చేయడడానికే ఉన్నారా?దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఏం చేస్తున్నారు?మంత్రి సత్యకుమార్ కూడా ఒకప్పుడు రౌడీనే.

డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆత్మగౌరవానికి భంగం కలిగింది.దానికి తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ప్రజలు ఆగ్రహిస్తే నానాజీ లాంటి తురుమ్‌ఖాన్‌లు కనుమరుగు అవుతారు.జనం నిలదీసేసరికి ప్రాయచ్చితదీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేసే ఉద్యమానికి దళిత సంఘాలు మద్దతిస్తాయి.రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తగులపెట్టారు.రఘురామకృష్ణంరాజు దళితులకు క్షమాపణలు చెప్పాలి.

దళితులంతా ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నారు.దళితులంతా వైసీపికి మద్దతు ఇస్తున్నందుకు కక్ష కట్టారు.ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు.ఏం సాధించారని వంద రోజుల పండుగ చేసుకుంటున్నారు?ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కేసును సుమోటోగా తీసుకుని విచారించాలి.దళిత ఉద్యోగులకు సరైన పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు.టీటీడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’అని జూపూడి హెచ్చరించారు.

ఇదీ చదవండి: పవన్‌ ప్రాయశ్చిత్తం అసలు దేనికోసం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement