Jupudi prabhakar rao
-
వంశీ అరెస్టుపై జూపూడి ఫైర్
-
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూపూడి ప్రభాకర్ రావు
-
‘కూటమి సర్కార్ కుట్ర.. విద్యుత్ కనెక్షన్ కట్’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫ్రీ వపర్దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే.. అంటే 2019, జూలై 25న, జీఓ జారీ చేశారు. ఆ విద్యుత్ సబ్సిడీ మొత్తం ప్రభుత్వం భరిస్తుందని అందులో ప్రకటించారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు రూ.2,362 కోట్లు, 4,57,686 గిరిజన కుటుంబాలకు రూ.483 కోట్ల మేర ప్రయోజనం కల్పించారు. అంటే మొత్తంగా 19,86,603 కుటుంబాలకు రూ.2846 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేశారు.ఉచిత విద్యుత్‌కు చంద్రబాబు సర్కార్ మంగళం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న కక్షతో, కూటమి ప్రభుత్వం ఒక హేయమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడింది. నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా సరే, బిల్లులు జారీ చేస్తోంది. బకాయిలు కూడా కట్టాలంటూ, వేలకు వేల బిల్లులు ఇస్తూ, కట్టకపోతే, నిర్దాక్షిణ్యంగా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. మీటర్లు తొలగిస్తున్నారు. స్పష్టమైన ఉత్తర్వులు (జీఓ) జారీ చేయకుండా చీకటి ఆదేశాలతో విద్యుత్ సిబ్బందిని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పంపి, అర్థరాత్రి సమయంలో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ప్రశ్నించిన దళిత, గిరిజన కుటుంబాలను, మహిళలను విద్యుత్ అధికారులు మాటల్లో చెప్పలేని విధంగా దూషిస్తూ, హేళన చేస్తూ దౌర్జన్యకాండ ప్రదర్శించారు.ప్రభుత్వ దమనకాండకు ఉదాహరణలుఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపవరంలో కొల్లి విమల అనే గృహిణి ఇంటికి రూ.22 వేల బిల్లు ఇచ్చి, అది కట్టలేదంటూ కనెక్షన్ తొలగించారు. అదే గ్రామంలో మరొకరికి రూ.40 వేల బిల్లు ఇచ్చి చెల్లించాలని, ఈనెల మరో రూ.20 వేల బిల్లు కూడా ఇచ్చి దానిని కూడా కలిపి కట్టాలని చెప్పి కనెక్షన్ కట్ చేశారు. రాఘవాపురంలో ప్రతి ఇంటికి దాదాపు రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లుల బకాయిలు చూపుతూ కనెక్షన్లు తొలగించారు.అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రూ.35 వేల బిల్లు చెల్లించాలంటూ ఓ దళిత కుటుంబాన్ని చీకటిమయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎ.మల్లవరంలో అర్థరాత్రి ఎస్సీ కాలనీలోకి విద్యుత్ అధికారులు చెప్పాపెట్టకుండా వెళ్ళి కూటమి పార్టీలకు మీరు ఓట్లు వేయలేదు, మీకు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తామంటూ వారి కనెక్షన్లు బలవంతంగా తొలగించారు. దీనిపై ప్రశ్నించిన దళిత మహిళలపై దుర్భాషలాడారు. అర్థరాత్రి మొత్తం గ్రామాన్ని చీకట్లో కూర్చోబెట్టారు. విద్యుత్ బిల్లు చెల్లిస్తాం కనీసం రెండు రోజులు గడువు ఇవ్వాలని వారు వేడుకున్నా కూడా పట్టించుకోలేదు.ఎస్సీ ఎస్టీలు కళ్ళు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుందిఎస్సీ, ఎస్టీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై దారుణం. ఒకవేళ వారు కళ్లు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని ఈ పాలకులు తట్టుకోలేరు. ఏ ఉత్తర్వులు ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు? మీ వద్ద దానికి సంబంధించిన లిఖిత ఆదేశాలు ఉన్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇష్టం లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓను రద్దు చేస్తున్నామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి మీరు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కానీ దొంగదారిలో దళిత, గిరిజన కాలనీలపై కక్ష సాధింపులకు పాల్పడటం ఏ మాత్రం తగదని జూపూడి ప్రభాకర్‌రావు తేల్చి చెప్పారు. -
ప్రజలపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి కరెంట్ ఛార్జీలు పెంచింది
-
Big Question: నీ మీద 420 కేసు పెడుతున్నాం.. ఇది కదా దమ్మున్న నాయకుడి లక్షణం
-
ముందు రాజ్యాంగం గురించి తెలుసుకో.. చంద్రబాబుపై పవన్ ప్రస్టేషన్..
-
బాబు, లోకేష్ పై జూపూడి కామెంట్స్
-
అంబేద్కర్ విగ్రహం కూల్చడానికి కూటమి కుట్ర ?.. బాబు పై జూపూడి ఫైర్
-
Jupudi: మీ తమ్ముడికి, మీ అక్క చెల్లెళ్లకి మీరు ఇచ్చిన ఆస్తి..
-
KSR Live Show: ఏపీలో అరాచకాలకు కారణం వాళ్లే !!
-
ఏపీలో రౌడీ రాజ్యం: జూపూడి ప్రభాకర్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రౌడీరాజ్యం కొనసాగుతోందని, రౌడీలు,రాజకీయ నాయకులు కలిసి జనానికి చుక్కలు చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జూపూడి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కాకినాడ టౌన్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే నానాజి రాద్దాంతం చేశారు.నానాజీ మీద పదకొండు కేసులున్నాయి.అలాంటి రౌడీని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?రంగరాయ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అలాంటి కాలేజీలో ప్రొఫెసర్లను,అమ్మాయిలను ఎమ్మెల్యే మనుషులు వేధిస్తున్నారు.దీనిపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తే ఆయనపై దాడి చేశారు.రౌడీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు స్టూడెండ్స్ డిమాండ్ చేస్తున్నారు.ఒక ఎస్సీ డాక్టర్‌ను పచ్చి బూతులతో ఎమ్మెల్యే దూషించారు.దళితులు కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు జాగ్రత్త.కలెక్టర్,ఎస్పీ కలిసి ఈ కేసును రాజీ చేస్తున్నారు.ఆ అధికారులు ఇలాంటి పనులు చేయడడానికే ఉన్నారా?దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఏం చేస్తున్నారు?మంత్రి సత్యకుమార్ కూడా ఒకప్పుడు రౌడీనే.డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆత్మగౌరవానికి భంగం కలిగింది.దానికి తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ప్రజలు ఆగ్రహిస్తే నానాజీ లాంటి తురుమ్ఖాన్లు కనుమరుగు అవుతారు.జనం నిలదీసేసరికి ప్రాయచ్చితదీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేసే ఉద్యమానికి దళిత సంఘాలు మద్దతిస్తాయి.రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తగులపెట్టారు.రఘురామకృష్ణంరాజు దళితులకు క్షమాపణలు చెప్పాలి.దళితులంతా ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నారు.దళితులంతా వైసీపికి మద్దతు ఇస్తున్నందుకు కక్ష కట్టారు.ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు.ఏం సాధించారని వంద రోజుల పండుగ చేసుకుంటున్నారు?ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కేసును సుమోటోగా తీసుకుని విచారించాలి.దళిత ఉద్యోగులకు సరైన పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు.టీటీడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’అని జూపూడి హెచ్చరించారు.ఇదీ చదవండి: పవన్ ప్రాయశ్చిత్తం అసలు దేనికోసం -
చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక
-
పిచ్చి కుక్కల అరుపులకు అదిరేది లేదు... బెదిరేది లేదు
-
చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న విషయం రామోజీరావు మరిచిపోతే ఎలా అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని విడగొట్టింది బాబేనని చెప్పారు. వారిలో మనస్పర్ధలు తెచ్చి, కోర్టులకెక్కేలా చేసి, దాడులకు ఉసిగొల్పిందీ చంద్రబాబేనన్నారు. ఈ విషయాలు తెలిసి కూడా రామోజీరావుకు బాబు మంచోడులా కనిపిస్తాడన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలిచి, పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రతి పేద కాలనీల్లో అందరూ ఒప్పుకునే మాట అని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీ విషం కక్కారని అన్నారు. సీఎం జగన్‌ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగిందని, అందులో భాగంగా బాబు దళితుల ఆపద్బాంధవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చిందని చెప్పారు. ఈ కథనం రాసిన ఈనాడు భయంకర కుట్రలకు వేదికగా చరిత్రలో నిలచిపోతుందన్నారు. దళితుల్ని బాబు గుర్రాలతో తొక్కిస్తే వార్త రాయలేదెందుకు అని నిలదీశారు. అసలు ఏనాడైనా బాబు దళితుల్ని మనుషుల్లా చూశారా అని ప్రశ్ని0చారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాషీ్టకాలేనన్నారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా? దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా బాబూ అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే జరిగాయని తెలిపారు. వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులని, ఆత్మ బంధువులని చెప్పారు. దళితులతో వియ్యమొందిన చరిత్ర చంద్రబాబు, రామోజీ కుటుంబాలలో ఉందా అని ప్రశంసించారు. ఈనాడు పుట్టిన దగ్గర్నుంచీ గడచిన 50 ఏళ్లల్లో ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందని వార్త రాశావా రామోజీ అని నిలదీశారు. చంద్రబాబు రక్తంలోనే దళిత వ్యతిరేకత బాబుకు దళితులంటేనే గిట్టదని జూపూడి చెప్పారు. ఆయన రక్తంలోనే ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ సీఎం స్థానంలో కూర్చొని నోరుపారేసుకున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి నీచత్వాన్ని పక్కనబెట్టి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలకు అండగా ఉండే సీఎం జగన్‌ని విమర్శిస్తూ రాసే మాయ రాతలను ప్రజలు నమ్మరని చెప్పారు. సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ, దళితవాడల్లో అభివృద్ధి ఫలాల్ని పూయిస్తూ, పేద పిల్లల చదువు ఖరీదు కాకూడదని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చి వారికి ఇంగ్లిషు మీడియం విద్యాబోధన చేయించిన సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. వైద్యం, ఆరోగ్యం విషయంలోనూ ఎన్నడూ ఊహించని విధంగా గ్రామస్థాయిలో మార్పు తెచ్చిన సీఎం జగనే అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ని మరిచిపోయే దళితులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్ని0చారు. రేపటి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలవబోతోందని చెప్పారు. -
‘పెత్తందారీ ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నం అని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు, బీసీల్నీ పదే పదే అవమానించి, టిప్పర్ డ్రైవర్లకు వైఎస్సార్సీపీ సీట్లు ఇస్తోందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. విభిన్న ప్రచారశైలిలో పెత్తందారీ పార్టీలు ప్రస్తుత ఎన్నికల రణరంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లల్లో పేదల పక్షాన నిలబడి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను, చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను చెప్పుకుంటూ పోతుంది. కానీ, ఏరోజూ పేదలను పట్టించుకోనటు వంటి అవతల వర్గం మాత్రం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పెత్తందారీ పోకడలతోనే ప్రచారంలో ఉంది. ముగ్గురు కలిసినా ప్రజలు వాళ్లను ఆదరిస్తారో లేదో కూడా అర్ధం కానటు వంటి పరిస్థితి. అందువల్ల ఆ పార్టీలు ఒకరికొకరు సఖ్యత లేకుండా అవతలగానే ఉండిపోతున్న స్థితి. పేదల కష్టసుఖాలు, వారి ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే.. మిగతా పార్టీల ఎన్నికల ప్రచారశైలి మాత్రం ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా భిన్నంగా ఉందన్న సంగతి చూస్తున్నాం. పెత్తందార్ల ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు పెత్తందారీ ప్రయోజనాల కోసం ఒక కిరాయి మనిషిలా చేతల్లోనే కాకుండా.. మాటల్లోనూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మొన్న శింగనమల అభ్యర్థి వీరాంజనేయులను ఉద్దేశించి.. టిప్పర్ డ్రైవర్‌కు సీటిచ్చి నిశానీలుగా వారిని వాడుకుని, వాళ్లద్వారా సంతకాలు పెట్టించుకుని వైఎస్ఆర్సీపీ ఏలాలని చూస్తుందంటూ ఎగతాళి చేశారు. అదే మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మాత్రం.. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా సహస్ర వృత్తులు టిప్పర్ డ్రైవరైనా, çప్లంబర్, మేసన్, వెల్డర్, కుమ్మరి, చాకలికి గానీ.. అనేక వత్తులకు గౌరవం తేవడానికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్లనటువంటి ఈ వర్గాలను చట్టసభల్లో నిలబెట్టి వాళ్ల వర్గాల తరఫున వారు మాట్లాడుకునేలా చూడాలని ఆయన తపిస్తున్నారు. బాబూ.. నీకూ సీఎం జగన్‌కు ఉన్న వ్యత్యాసమిది రెండెకరాలతో రాజకీయం మొదలుపెట్టి లక్షల కోట్లకు నువ్వు ఏ విధంగా ఎదిగావో అందరికీ తెలుసు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీలు ఏనాడూ దృష్టి పెట్టలేదు. అయితే, నువ్వు మాత్రం దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాల్లోని పేదలంతా మీ చెప్పుచేతల కింద మోచేతి నీళ్లు తాగుతూ బతకాలని కోరుతున్నావు. ఏంటి మీ పెత్తందారీ అహంకారం..? మీతో సరిసమానంగా ఉండే హక్కు దళితులకు లేదనుకుంటున్నావా..? ఉన్నా ఉపయోగించుకోరాదని నుకుంటున్నారా..? ఇప్పుడు మీరునుకుంటున్న పెత్తందారీ పోకడలకు కాలం చెల్లింది. మాకు కొండంత అండగా శ్రీ వైఎస్ జగన్ ఉన్నారు. అదే నీకూ.. మా జగన్ గారి మధ్య ఉన్న వ్యత్యాసం. మేం బాగు పడితే మీకెందుకంత కడుపుమంట? పేద కుటుంబాల పిల్లలకు చదువు ఖరీదు కాకూడదని అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందించే ప్రభుత్వాన్ని అవహేళన చేస్తావా చంద్ర బాబూ..? ఉచిత విద్యను అందించే బడులను బాగుచేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లుతో పాటు తరగతి గదుల్లో ఇంగ్లీషు పాఠాలు చెబుతుంటే.. పేదలకు ఇంగ్లీషు బోధన అవసరమా..? అంటూ కోర్టులకెళ్లి మరీ అడ్డుకుంటావా..? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ట్యాబ్‌లిస్తే మీకంత కడుపు మంట ఎందుకు..? పేద వర్గాలకు కొండంత అండగా సీఎం జగన్ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మొదట్నుంచీ ఒక విషయం పదేపదే చెబుతున్నారు. పేదలు.. పెత్తందారీ వర్గం మధ్య జరుగుతోన్న యుద్ధమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. రూ.2.70 లక్షల కోట్లను పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించి పేదవర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి జగన్‌గారు. బ్యాంకు అకౌంట్లు పెత్తందారీ అగ్ర వర్ణాలకే కాదు. దళిత, బీసీ, మైనార్టీలకూ ఉంటాయని, అకౌంట్లలో డబ్బులు నేరుగా జమ అవుతాయని నిరూపించిన పేదల పక్షపాతి ప్రభుత్వం ఇది. మా సంక్షేమం జోలికొస్తే ఊరుకోబోం చంద్రబాబూ.. బహిరంగ సభల్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమౌతుందా..? నీకు పిచ్చి పట్టిందో, వయస్సు పెరిగి చాదస్తం పెరిగిందో.. లేదంటే, ఎన్నికలవగానే పారిపోదామనుకుంటున్నావో అర్ధం కావట్లేదు. కానీ, మా నాయకుడు జగన్ గారు చేస్తోన్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల జోలికొస్తే మాత్రం దళిత, బీసీ, మైనార్టీల వర్గాలు ఊరుకోరు. మిమ్మల్ని, మీతో పాటు వచ్చే పార్టీలను తరిమి తరిమి కొడతారు. తండ్రీకొడుకులకు పరిపాలనా అర్హతే లేదు పేదవాడికి , బడుగు బలహీనవర్గాలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని నువ్వంటే.. నీకూ, నీ కొడుకుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకెక్కడిదని చంద్రబాబు, లోకేశ్‌లను అడుగుతున్నాను. నీ కొడుకు ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిన మంత్రిపదవిలో కూర్చొని ఏం చేశాడు..? అతనికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్థాయి ఎంత..? పరిపాలన, పేదల బతుకుల పట్ల అతనికున్న అవగాహనేంటి..? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పరిపాలన ఏంటి..? మీ పరిపాలనలో మీ కులస్తులు, మీకు కొమ్ముకాసే అగ్రవర్ణాలు తప్ప ప్రయోజనాలు పొందిన వారెవరు..? ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే.. 2019లో మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారు.అయినా మీ వైఖరి మారలేదు. అందుకే రాష్ట్రంలో పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా మీపై తిరగబడే రోజులొచ్చాయి. అంబేద్కర్, ఫూలే అంటే మీకు నచ్చదా..? చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విగ్రహం పెడతానన్నాడు. అది ఎటు పోయిందో ఏం చేశాడో తెలియదు. కానీ, అదే అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు విజయవాడ లో నిలబెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఆవిష్కరించా రు. కనీసం, ఏ ఒక్కరోజైనా ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు రెండు పువ్వులు అంబేద్కర్ గారి పాదాల దగ్గర పెట్టారా..? అంటే, అంబేద్కర్, ఫూల్ గారంటే మీకు నచ్చదా..? అంబేద్కర్ రాజ్యాంగమంటే మీకు గౌరవం లేదా..? ఎస్సీలు రెడ్లను పెళ్లి చేసుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్లకు వస్తారా.. అంటూ మాట్లాడుతున్నావే.. నీకసలు బుద్ధుందా చంద్రబాబూ..? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానంటావే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా చెప్పుకుంటావే.. మరి, ఇన్నాళ్లలో నువ్వు ఏనాడూ అగ్రవర్ణాలను వివాహమాడిన ఎస్సీలకు సీట్లివ్వలేదా..? అంటే, అంబేద్కర్ గారు పెట్టిన కులనిర్మూలనకు, రాజ్యాంగంలో రాసుకున్న దానికి మీరు వ్యతిరేకమా..? కుల వ్యతిరేక పోరాటంలో వైఎస్ఆర్ కుటుంబం కుల నిర్మూలన గానీ.. కులం అనేది ఈ దేశంలోనే ఉండరాదని రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని ఆచరణలో చూపినటు వంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడిగారి కుటుంబ గొప్పదనం గురించి నీకు తెలుసా చంద్రబాబూ..? రాజశేఖర్‌రెడ్డి గారి మేనత్తలంతా ఎస్సీలను చేసుకున్నోళ్లు కాదా..? నీ కుటుంబంలో .. నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందా..? ఒక ఎస్సీని, ఒక బీసీని పెళ్లి చేసుకున్న చరిత్ర నీదగ్గర ఉందా..? ఆయా వర్గాలన్నింటినీ కూలోళ్లుగా మీ ఇళ్లల్లో పనిచేయించుకున్నారే గానీ.. వాళ్లను వివాహమాడి మీ ఇంట్లో భాగస్వామ్యం కల్పించలేని అహంకారివి నువ్వు. అలాంటి నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలు ఏవిధంగా అర్ధమౌతాయి. బాబును క్షమించే ప్రసక్తేలేదు.. తరిమి కొడతాం చంద్రబాబును ఏ విధంగా.. ఎందుకు క్షమించాలి..? ఇదే చంద్రబాబు గతంలో ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని అవమానించాడు. బీసీలనైతే నోరెత్తితే తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇలాంటి నీచమైన భావజాలం ఉన్న నాయకుడ్ని ఊరూరా దళిత వాడల్లో జనం అడుగడుగునా నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకనటువంటి నువ్వు.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని నువ్వు.. ఎస్సీ నాయకులపై నోటికొచ్చిన విధంగా మాట్లాడే నువ్వు.. ఈ రాష్ట్ర పరిపాలనకు అర్హుడివి కాదు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలోనే గొప్ప సంస్కరణవాదిగా మా నాయకుడు జగన్ ఉన్నారు గనుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఆయన పక్షాన నిలుస్తున్నారు. అందువల్ల ఆయనే తిరిగి సీఎం అవుతారని జూపూడి స్పష్టం చేశారు. -
అసలు చంద్రబాబును నమ్మేదెవరు?: జూపూడి ప్రభాకర్
సాక్షి, విజయవాడ: అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబును నమ్మేదెవరు?. లక్షల కోట్ల డీబీటీని మళ్లీ అందించేందుకు సీఎం జగన్ సిద్ధం.. మీరు దేనికి సంసిద్ధం చంద్రబాబూ? అంటూ ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వాన్ని ఆపాలనే మీ కలలు...పగటి కలలే అంటూ దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి దరిదాపుల్లో కూడా లేని మీరు దేనికి సంసిద్ధం?. ప్రజలకు మీరు చేసిన ఒక్క మేలైనా చెప్పి సంసిద్ధం అనండి బాబూ..!. ఒక బీసీ, ఎస్సీకి అయినా రాజ్యసభ సీటు ఇచ్చావా బాబూ?. భువనేశ్వరి వెన్నుపోటా.. లేక తల్లీ కొడుకుల కుట్రా’’ అంటూ జూపూడి మండిపడ్డారు. జూపూడి ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే. మళ్ళీ లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించేందుకు మేం సిద్ధం ►వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ నాయకత్వంలో దూసుకువెళ్తోంది ►ఆయన్ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర పూరితంగా ఒకటవుతున్న విధానం ప్రజలు గమనిస్తున్నారు. ►సిద్ధం అనే శబ్దాన్ని రణనినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతో రాష్ట్రంలో జగన్ గారు పెడుతున్న సభలకు వస్తున్న ప్రజలే మా సుపరిపాలనకు నిదర్శనం. ►సీఎం జగన్ సిద్ధం అని ఎందుకు అంటున్నారో దాన్ని ప్రతిపక్షాలు గ్రహించడం లేదు ►వారి జీవిత కాలంలో జగన్ గారు చేసిన పనులు చేయలేక, ఆయన్ను వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ►మేము సిద్ధం అంటే..వారు మేము కూడా సిద్ధమే..సంసిద్ధమే అంటూ బలహీనమైన గొంతుతో బేలగా మాట్లాడుతున్నారు ►ఈ రాష్ట్రంలో తిరిగి డీబీటీ ద్వారా లక్షల కోట్లు ప్రజలకు పంచడానికి మేం సిద్ధం ►జగన్‌ని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి తలుపు తట్టి వస్తాయి. దానికి మేం సిద్ధం ►ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తీసుకురావడం, వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఎన్నో మార్పులు తెచ్చాం ►55 వేల మంది సిబ్బందిని నియమించాం ►ప్రతి పల్లెకు వైద్యం అందించేందుకు మేం సిద్ధం ►మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం వైఎస్సార్సీపీ సిద్ధం ►పేదరిక నిర్మూలన కోసం మేం సిద్ధం...ఆర్బీకే సెంటర్ల ద్వారా వైఎస్సార్ ఆలోచనా విధానాలను అమలు చేయడంలో మేం సిద్ధం ►ఈ రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ను నమ్మేవాడెవడు..? ►ఏం చేశారని తెలుగు దేశం పార్టీ సంసిద్ధం అంటుందో చెప్పాలి? ►గతంలో మీరు చేసిన మంచిని ఒక్కటంటే ఒక్కటి చూపించండి? ►ఏనాడైనా మీరు పేద ప్రజలను పట్టించుకున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా? ►అసలు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మేవాడెవడు? ►నేడు రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి...తిరిగి దాన్ని కొనసాగించడానికి జగన్ గారు సిద్ధం అంటున్నారు ►తన 45 ఏళ్ల అనుభవంలో చంద్రబాబు ఇలాంటి పరిపాలన ఒక్కటన్నా చూపించగలడా? ►మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే.. వైఎస్ జగన్‌కి కోవిడ్ కాలం పోను రెండు-మూడేళ్లు మాత్రమే సుపరిపాలన అందించే అవకాశం కలిగింది ►ఈ కాలంలోనే రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమం- అభివృద్ధిని అందించారు ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ►నేడు గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతోంది ►మీ హయాంలో మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యంపై తప్ప సమాజం ఆరోగ్యం గురించి ఆలోచించారా? అట్టడుగు వర్గాలకు ఇళ్లుకావాలి, ఆరోగ్యం కావాలి..కూడు, బట్ట కావాలని ఏ రోజైనా మీరు ఆలోచించారా? ►నేడు సీఎం జగన్ అట్టడుగు వర్గాల కోసం పని చేస్తుంటే.. ఏ రోజైనా జగన్ గారు మంచి చేస్తున్నారు అని మాట్లాడారా? ఈ ప్రభుత్వాన్ని ఆపాలనే మీ కలలు...పగటి కలలే: ►అంబేద్కర్ ఆశయాలను జగన్ గారు ముందుకు తీసుకెళుతుంటే..మీ పెయిడ్ వర్కర్స్‌తో విమర్శలు చేస్తున్నారు ►ఈ ప్రభుత్వాన్ని ఆపాలని మీరు కనే వెర్రి కలలు నెరవేరవు ►సీఎం జగన్ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి ఏం చేయాలో అది చేస్తున్నారు ►మీరు వెళ్లి సామాన్యుడితో కలిసి మంచంపైన కూర్చోగలవా చంద్రబాబూ..? ఇక దేనికి మీరు సంసిద్ధం..? ►శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తానన్నట్లు జగన్ గారు పేదల చెంతకు పాలన తీసుకువచ్చారు ►అంబేద్కర్ విగ్రహాంపై సోషల్ మీడియాలో మాలాంటి వారి మాటలను వక్రీకరిస్తున్న పచ్చమీడియాకు బుద్ధుందా? ►మీరు అవహేళన చేసినంత మాత్రాన మా మనసులు మారతాయా? ఒక ఎస్సీకి రాజ్యసభ సీటు ఇచ్చావా బాబూ? ►ఈ సమాజం బాగుపడాలని, అంతరాలను చెరిపేయాలని జగన్ గారు చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూడండి ►అగ్రవర్ణాలను కాదని బీసీలను, ఎస్సీలను పార్లమెంటులో కూర్చోబెట్టిన ఘనత జగన్‌ది ►ఒక ఎస్సీ గొల్ల బాబూరావును మా నాయకుడు పెద్దల సభలో కూర్చోబెట్టారు ►ఏ రోజైనా ఒక ఎస్సీకి చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చాడా? వర్ల రామయ్య గారి ఆవేదన అందరూ చూశారు కదా? ►అందుకే జగన్ గారు మళ్లీ రావాలని మేమంతా కోరుకుంటున్నాం ►మా బిడ్డల చదువుల కోసం, వారి ఆకలి తీర్చేందుకు మాకు జగన్ గారి పరిపాలన కావాలని మేం ఆయన్ను గెలిపించేందుకు సిద్ధం ►చంద్రబాబు పొరపాటున వస్తే ఇవన్నీ మింగేసి తన వర్గానికి, కులానికి ఇచ్చుకునే చెత్త ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టడానికి సిద్ధం ►మీరు సంసిద్ధం అనడానికి మీకేమైనా చెప్పుకునేందుకు ఒక మార్క్ ఏమైనా ఉందా? ఈ రాష్ట్రంలో అసలు మీ పాత్ర ఎంత..? ►చంద్రబాబు తోకపట్టుకుని తిరుగుతున్న పవన్ కల్యాణ్ అతని చరిత్ర ఏంటో తెలుసుకో ముందుగా ►ఈ రాష్ట్రంలో అసలు మీ పాత్ర ఎంత? వీరిద్దరినీ నడిపిస్తున్న బీజేపీ పాత్ర ఎంత? ►జగన్‌ని ఓడించడం కోసం నేనే ముఖ్యమంత్రి అంటూ పవన్ కల్యాణ్ చెప్తున్నారు ►ఏపీలో టీడీపీ 80 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని అమిత్‌షా చెప్తుంటే తట్టుకోలేక, గుక్కపట్టి ఏడుస్తున్న నువ్వెలా సంసిద్ధం అవుతావ్ చంద్రబాబూ..? ►ఈ యుద్ధానికి ఇంతవరకూ దరిదాపుల్లోకి కూడా రాని మీరు ఏ రకంగా సిద్ధం..? ►జగన్ మా నాయకుడుగా ఉండటాన్ని మేం గర్వంగా ఫీల్ అవుతున్నాం ►జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలని మేం కోరుకుంటున్నారు. బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే జగనన్న ఆలోచనా విధానం ►మీరు అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా కోల్పోయారు ►దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్లార్రా మీరంతా? ►అంబేద్కర్ ఆలోచనా విధానంతో నడుస్తున్న జగనన్న ప్రభుత్వం వర్ధిల్లాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. భువనేశ్వరి వెన్నుపోటా..!: ►భువనేశ్వరి గారు కుప్పం నుంచి పోటీకి దిగితే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? ►అలాగైతే అసెంబ్లీలో ఏదో జరిగిందని వెక్కి వెక్కి ఏడ్చి..సీఎం అయితేనే సభకు వస్తానన్న శపథం ఏమవుతుందో చూసుకో ►నువ్వు పలాయనం చిత్తగించే ముందు ప్రజలకు సమాధానం చెప్పి వెళ్లు. ►అసలు ఆవిడ కుప్పం నుంచి వాళ్ల ఆయన్ను ఎందుకు మారుస్తుందో చూడాలి ►ఇదేమన్నా భువనేశ్వరి గారి వెన్నుపోటా? మా నాన్నకు వెన్నుపోటు పొడిస్తే.. నీకు పొడవమా అని పొడుస్తోందా? ►లోకేశ్, భువనేశ్వరిలు ఏమైనా కుట్ర పన్నారా? ఇవన్నీ మాకు అనవసరం ►పవన్ కళ్యాణ్ జొరబడ్డ తర్వాత టీడీపీలోని సీనియర్ నాయకులు ఎటు వెళ్తున్నారో మాకు అనవసరం ►అమిత్‌షా దెబ్బకు నోరు మెదపకుండా తిరుగుతున్న చంద్రబాబు టీడీపీ క్యాడర్, ఆశావహులకు సమాధానం చెప్పాలి ►ఇన్నేళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కేస్తున్నావా చంద్రబాబూ? ►నీ పార్టీని ముంచేయడానికి సంసిద్ధమవుతున్నావా? ►గుర్తుంచుకో చంద్రబాబు.. ఆ రోజు వస్తుంది.. ప్రజలు మళ్లీ మళ్లీ వైఎస్ జగన్నే ఎన్నుకుంటారు. -
సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువే
సాక్షి, అమరావతి: ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాల మధ్య శకుని పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. దేశ స్వాతంత్య్రమంత వయసు కలిగిన రామోజీరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నంత మాత్రాన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా? అని ప్రశ్నిచారు. అసైన్డ్ భూములను ఆక్రమించి ఫిలింసిటీని నిర్మించుకున్నది రామోజీరావు అయితే అసైన్డ్ భూములపై బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. దళితులు కళ్లు తెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారని హెచ్చరించారు. పేదోడి బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్న దురహంకారి రామోజీ అని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా? అని ప్రశ్నిచారు. సీఎం జగన్ పట్ల దళితులకున్న ప్రేమను చంద్రబాబు బృందం ఎప్పటికీ కొనలేదని స్పష్టం చేశారు. దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, ఈనాడు రామోజీరావుకు తెలియవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవేమిటి మరి? పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ నాలుగేళ్లలో పారదర్శకంగా రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించిన సీఎం జగన్ ఖచ్చితంగా దళిత బంధువు అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తే లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఇటీవల సర్వే ద్వారా కేంద్రమే గుర్తించిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డులో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువేనని స్పష్టంచేశారు. -
పదవుల కోసం పచ్చి అబద్ధాలు
తిరుపతి కల్చరల్: బూటకపు మాటలతో, అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపుతూ మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించి ప్రజల్ని నట్టేట ముంచిన టీడీపీ నేతలు పదవీకాంక్షతో నేడు పచ్చి అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని మోసపూరిత మాటలతో మభ్యపెట్టి దోచుకునే టీడీపీ పార్టీకి మేనిఫెస్టోపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఏనాడైనా టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా..? అని ప్రశ్నించారు. 1995లో వెన్నుపోటుతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు మేము మైక్రోసాఫ్ట్ తెస్తే సత్య నాదెండ్ల చదువుకుని సీఈవో అయ్యారని చెప్పడం బాబు దగాగోరు తనానికి నిదర్శనమన్నారు. వాస్తవానికి 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2014లో ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి కేవలం 10 శాతం కూడా అచరణలో పెట్టలేదన్నారు. గత 14 ఏళ్లు సీఎంగా పాలన సాగించిన చంద్రబాబు ఏనాడూ దళిత, బడుగు, బలహీన వర్గాల పేదల అభ్యున్నతిని పట్టించుకున్న పాపానపోలేదని చెప్పారు. ప్రజలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు తెస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చరిత్ర బాబుదేనన్నారు. నిలకడలేని పవన్ కళ్యాణ్, అబద్ధాల దగాకోరు చంద్రబాబు, అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినా 175 స్థానాల్లో పోటీచేసి పూర్తి స్థాయి గెలుపు సాధించే సత్తా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దమ్ముంటే బాబు, అచ్చెన్నాయుడు అసెంబ్లీకి వస్తే మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని జూపూడి సవాల్ విసిరారు. -
‘అల్లర్లకు టీడీపీ యత్నం’
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ యత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ మాత్రం రాష్ట్ర పరువు తీయడానికి యత్నిస్తోందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ) సీఎండీ రజనీష్‌లను కలిసి పలు అంశాలపై చర్చించామన్నారు. దళితులకు ఉపకరించే ప్రధానమంత్రి అనుశ్చిత్ జాతి అభ్యుదయ్ (పీఎం–అజయ్) పథకం గురించి సుబ్రహ్మణ్యం వివరించారని, ఆ దిశగా ఏపీలో దళితుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే..
సాక్షి, అమరావతి: టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా దక్కే ఫలితం గుండు సున్నానే అని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ గత రెండున్నరేళ్లుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రోజూ రాజకీయాధికారం దక్కని వర్గాలకు ఇప్పుడు దాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన పదవులను బడుగు, బలహీనవర్గాలకు కూడా వందల్లో, వేలల్లో అందించారని కొనియాడారు. భారత రాజ్యాంగానికి ప్రతిరూపంగా సామాజిక న్యాయం ఏపీలోనే అమలవుతోందని సామాజిక న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకుని ముందుగానే కాడి పారేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న బడుగు, బలహీన వర్గాలన్నీ సీఎం జగన్‌కి అండగా నిలుస్తున్నారని తెలిపారు. టీడీపీతో ఉన్న వర్గాలేవో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీలపై చంద్రబాబు వాడిన భాషను ఎప్పటికీ ఈ వర్గాలు మరిచిపోవన్నారు. దళిత మహిళా హోం మంత్రి సుచరితపై టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అలాంటి మాటలను నియంత్రించకుండా నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు. చదవండి: AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్! -
చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి
-
చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతి రూపం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, అన్ని వర్గాలకు ఆయన సమ న్యాయం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేషన్ డైరెక్టర్లలో 52 శాతం మహిళలకు ఇచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు. టీడీపీ శ్రేణులు కావాలని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు హయాంలో ఏం న్యాయం జరిగిందని జూపూడి ప్రశ్నించారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. సామాజిక న్యాయం చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది. బాబు ఎప్పుడూ బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారని దుయ్యబట్టారు. బలహీనవర్గాలను చంద్రబాబు ఎప్పుడూ చులకనగానే చూశారని జూపూడి ధ్వజమెత్తారు. ఎస్టీ అధికారి సవాంగ్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని జూపూడి ప్రభాకర్ దుయ్యబట్టారు. ఇవీ చదవండి: విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ.. -
ఏపీపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదన్నారు. అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని జూపూడి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు తన పాలనలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజం. ప్రభుత్వంపై కుట్రలు చేయటమే చంద్రబాబు పనిగా కనిపిస్తోంది. రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు. దొంగలు మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నారని’’ జూపూడి ధ్వజమెత్తారు. చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స -
చంద్రబాబు చెప్పింది కరెక్టే అని డీజీపీ చెప్పాలా!
సాక్షి, తాడేపల్లి : ప్రజా సమస్యలపైన అవిశ్రాంతంగా పోరాడటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలతోపాటు మిగిలిన వర్గాలు అందరూ ముఖ్యమంత్రితోనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రివర్గంలో సింహభాగం దళితులు, మైనార్టీలే ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు అసత్యాన్ని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కొన్ని ఘటనలు జరుగుతున్నాయని తెలిపిన జూపూడి వాటిపై ప్రభుత్వం స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. చదవండి : (పవన్‌తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశాం) చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనను చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అంటగట్టడానికి ప్రయత్నించారని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. సీఎం దళిత వ్యతిరేకి చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. డీజీపీ లాంటి వ్యక్తులపై కూడా తెలుగుదేశం పార్టీ బురద జల్లే కార్యక్రమం పెట్టుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పింది కరెక్టే అని డీజీపీ చెప్పాలా....! అని, అనేక విషయాల్లో డీజీపీని అవమాన పరిచేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దళితులపై దాడి చేస్తే అది సీఎం జగన్ చేయించాడని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది మరొక విధంగా ఉందన్నారు. చదవండి : మేము గుర్తుకు రాలేదా.. బాబు? ‘చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎప్పుడు పోటీ పడలేరు. ఆయన దెబ్బకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో తోక ముడిచింది. మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గత అయిదు సంవత్సరాల్లో నీ చుట్టూ తిరిగితే ఎందుకు అతని సమస్య పరిష్కరించలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆయనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. దళితులంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడు. మీ ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగినప్పుడు హోంమంత్రి, డీజీపీ ఎప్పుడైనా వెళ్లారా ? హోంమంత్రి, డీజీపీ దళితుడు కాబట్టి మీకు చులకనగా కనిపిస్తున్నారా. దళితులంతా ఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్నారు. మహిళలంతా ఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్నారు. చదవండి : చంద్రబాబుదో అబద్ధాల ఫ్యాక్టరీ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గాని ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో గాని మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అందుకే ఇప్పుడు తండ్రి కొడుకులు దళిత జపం చేస్తున్నారు. దళితులు అడ్డంపెట్టుకుని చంద్రబాబు చేసే చీటింగ్ వ్యవహారాలు ఇప్పటికైనా మానుకోవాలి. దళితులు ముందుకు నడిపించే విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ దేశానికి ఆదర్శం ఆయన దళితులకు వ్యతిరేకమని చిత్రీకరించాలి అనుకుంటే అది మీ తండ్రులు, తాతలు వల్ల కూడా కాదు. అని స్పష్టం చేశారు. -
‘అది మీ తండ్రులు, తాతల వల్ల కూడా కాదు’
-
జగన్‌ది అలాంటి వ్యక్తిత్వం కాదు
సాక్షి, అమరావతి: తనపై తాను హత్యాప్రయత్నం చేయించుకొని, దాన్ని రాజకీయం చేసే వ్యక్తిత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డిది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావే అన్నారు. మంగళవారం సచివాలయంలో పబ్లిసిటీ సెల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా హుందాగా ఎలాంటి రాజకీయం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారని.. చుట్టపక్కల ఉండే వాళ్లే తర్వాత దీన్ని రాజకీయం చేశారని వ్యాఖ్యానించారు. జగన్‌పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలలే హత్యాయత్నం చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అతడి విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఒక ప్రశ్నకు బదులుగా జూపూడి అన్నారు. సినిమా సీరియస్‌గా సాగుతుంటే మధ్యలో బ్రహ్మానందం కామెడీ మాదిరి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని.. టీడీపీ కూడా ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. గవర్నర్ ఢిల్లీ ఏజెంట్‌గా మారిపోయారని.. జగన్‌పై జరిగిన హత్యాయత్నం టీ కప్పులో తుఫాన్‌లాంటి సంఘటనగా పోల్చుతూ ఏమీ లేని చోట గవర్నర్ డీజీపీ నివేదిక కోరడం ఏంటని ప్రశ్నించారు. -
‘బీజేపీ తోకముడిచి పారిపోతోంది’
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీపై టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విలువలు లేని జాతీయ పార్టీ అని విమర్శించారు. ప్రధాని మోదీ నియంత పోకడలకు పోతున్నారన్నారు. బీజేపీ చేసిన మోసంపై వందసార్లు ప్రశిస్తామని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక బీజేపీ నేతలు తోకలు ముడిచి పారిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ రోజు పైకెళ్తున్నామనుకుంటే సరిపోదు, ఆరోహణ క్రమం తరువాత అవరోహణ క్రమం ఉంటుందని, అందుకే బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని వ్యాఖ్యానించారు. హిట్లర్‌లా పాలించాలంటే కుదరదని, పాకిస్థాన్‌లో ముషారఫ్‌కు ఏమైందో మోదీ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం అంటూ వచ్చి నియంతలా వ్యవహరిస్తున్న మోదీకి అదేగతి పడుతుందన్నారు. రేపు కర్నాటక ఎన్నికల్లో బీజేపీ నేతలు ఉత్తర కుమారులు కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో 18 నియోజక వర్గాలను ప్రభావితం చేయగల స్థితిలో తెలుగు ప్రజలు ఉన్నారని జూపూడి పేర్కొన్నారు. -
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!
హైదరాబాద్: జూపూడి ప్రభాకరరావుకు అదృష్ణం కొద్దిలో మిస్ అయింది. మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ మళ్లీ వచ్చినట్టే వచ్చి ఇట్టే చేజారీ పోయింది. ఆ అదృష్టాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె. ప్రతిభ భారతికి కొట్టేశారు. అంతా చివర నిమిషంలో చకచకా జరిగిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్లితే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానానికి జూపూడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే జూపూడి స్వస్థలం ప్రకాశం జిల్లా అయినా... ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దాంతో ఆయన ఓటు హక్కు కూకట్‌పల్లిలో ఉంది. ఆ విషయం ఆఖరి నిమిషంతో పార్టీ అధినేతకు తెలిసింది. కాగా శాసనమండలికి పోటి చేసే అభ్యర్థికి సదరు రాష్ట్రంలో ఓటు హక్కు తప్పని సరిగా ఉండాలి. దాంతో జూపూడికి చేతిలోకి వచ్చిన అదృష్టం... కళ్ల ముందే చేజారింది. కాగా ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర నేత కావలి ప్రతిభ భారతిని చంద్రబాబు ఎంపిక చేశారు. జూపూడి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆ పార్టీలోని సీనియర్లు కుతూహలమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్ ... అంతా టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నిన్న కాక మొన్న వచ్చిన జూపూడికి ఎలా ఇస్తారంటూ ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్లు అంతా చంద్రబాబు నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దాంతో అందరి ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకు ప్రతిభను బాబు తెరపైకి తీసుకొచ్చారు. ప్రతిభకి పట్టం కడితే అందరికి అమోదయోగ్యమని బాబు యెచించారు. కానీ ప్రతిభకు ఛాన్స్ ఇస్తే... కృష్ణా జిల్లా నుంచి బరిలోకి దిగుతున్న ఇద్దరు ఎమ్మెల్సీల్లో పంచుమర్తి అనురాధకు ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఆమెను నామినేటేడ్ పోస్ట్‌లో కుర్చోబెట్టాలని ఇప్పటికే చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని సమాచారం. మరోవైపు జూపూడి ఈ ఛాన్స్ మిస్ అయినా కనీసం గవర్నర్ కోటాలో అయినా ఎమ్మెల్సీ సీటు దక్కుతుందేమో అని వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. -
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!
-
నిన్న కాక మొన్న వచ్చినవారికా టిక్కెట్..?
హైదరాబాద్: ఎమ్మెల్సీ టికెట్ జూపూడి ప్రభాకరరావుకు ఖరారు చేయడం పట్ల టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగులుకుంది. ఇటీవలే పార్టీలోకి వచ్చిన జూపూడికి ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారంటూ సదరు నేతలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఏళ్ల తరబడి సేవ చేస్తున్న దళిత నేతలకు అన్యాయం చేశారని వారు మండిపడుతున్నారు. ఇదేనా దళితులకు చేసే న్యాయమని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 24 గంటలూ చంద్రబాబును తిట్టిన జూపూడికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, కుతూహులమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్ తీవ్ర నిరాశతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వకపోవడంపై సీమాంధ్ర ప్రాంతంలోని ఓ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు తమ సామాజిక వర్గం వెంటపడిన చంద్రబాబుకు ఇప్పుడు మేం గుర్తుకు రాలేదా? అంటూ మండిపడుతున్నారు. నమ్ముకున్న పార్టీ అన్యాయం చేసిందంటూ అనుచరులు వద్ద కడప టీడీపీ సీనియర్ నేత లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది కార్పొరేట్ నేతలు ఎమ్మెల్యే టికెట్ రాకుండా తనను అడ్డుకున్నారని లింగారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు తన హామీ నిలబెట్టుకోలేదని లింగారెడ్డి మనస్తాపం చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న వచ్చిన ఈ నేతకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం పట్ల పార్టీకి చెందిన దళిత నేతలతోపాటు ఇతర నాయకులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఓ స్థానాన్ని మిత్ర పక్షమైన బీజేపీకి కేటాయించింది. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత పాలడుగు వెంకట్రావ్ ఆకస్మిక మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి విదితమే. ఆ ఎమ్మెల్సీ స్థానానికి జూపూడి ప్రభాకరరావును టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. -
జూపూడి అమ్ముడుపోయారా?
-
‘జూపూడి దళిత ద్రోహి ’
గుంటూరు సిటీ : అనామకుడిగా ఉన్న తనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిన జూపూడి ప్రభాకరరావు దళిత ద్రోహి అని రెల్లి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సోమి కమల్ అభివర్ణించారు. ఆయన యావత్ దళిత జాతికే ద్రోహం తలపెట్టే మహానుభావుడని ధ్వజమెత్తారు. జూపూడి వ్యవహారం కచ్చితంగా అవకాశవాద రాజకీయాల కిందకే వస్తుందన్నారు. జూపూడి వైఖరిని నిరసిస్తూ సోమవారం రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకి అయిన జూపూడిని పార్టీలోకి తీసుకోవ డం చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తక్షణం తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని కమల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెల్లి సంఘం నేతలు రవుతులాల్, భూపతి దీరరాజు, బండిశ్రీను, కోనా విశ్వనాథ్, బొబ్బిలి దుర్గాప్రసాద్, బండి వాసు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి రాజీనామా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు పార్టీకి రాజీనామా చేశారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. -
ఆ ఇద్దరూ రాష్ట్రద్రోహులు
చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిపై జూపూడి మండిపాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం టంగుటూరు, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రద్రోహులని వైఎస్ఆర్ సీపీ కొండపి నియోజకవర్గ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. వారిద్దరూ కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధిలో గల తేటుపురం, అనంతవరం, తాళ్లపాలెం, వెలగపూడిలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన సెంటర్లలో ప్రజలనుద్దేశించి జూపూడి మాట్లాడుతూ పదవీకాలం చివరి వరకూ సీఎంగా అధికారాన్ని అనుభవించిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. అనంతరం రాజీనామా డ్రామా ఆడి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అదే విధంగా ప్రతిపక్షనేతగా ఉండి కూడా అధికార పార్టీకి కొమ్ముకాసి పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేందుకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దారుణమైన పరిస్థితులకు వారిద్దరే కారణమన్నారు. వారిద్దరికీ బుద్ధిచెప్పేందుకు వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని జూపూడి కోరారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి అన్నీ ఉచితంగా ఇస్తానని చెబుతున్న చంద్ర బాబు.. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారం కోసం అమలుసాధ్యం కాని హామీలిస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తున్న ఆయన్ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. జగన్ పథకాలు అద్భుతం... నిత్యం జనం మధ్యనే తిరిగే వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగుచుక్క అని జూపూడి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించిన పథకాలు అద్భుతమని తెలిపారు. క్షేత్రస్థాయిలో చిన్నచిన్న సమస్యలకు కూడా జగన్ పథకాలతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. అమ్మ ఒడి, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, పింఛన్ల పెంపు, 24 గంటల్లో అన్ని కార్డుల మంజూరు, తదితర పథకాలు రాష్ట్ర ప్రజల తలరాత మారుస్తాయని జూపూడి వివరించారు. ప్రచార కార్యక్రమంలో టుబాకో బోర్డు డెరైక్టర్ రావూరి అయ్యవారయ్య, పార్టీ మండల కన్వీనర్ బొట్లా రామారావు, నాయకులు పోతుల నరసింహారావు, ఉప్పలపాటి నర్సరాజు, సర్పంచ్ కసుకుర్తి సుందరరావు, పార్టీ ఎస్సీసెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కసుకుర్తి ప్రసాద్, బొమ్మిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం
సింగరాయకొండ, న్యూస్‌లైన్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ జయంతిని సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర ్భంగా జూపూడి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అల్లు వెంకటేశ్వర్లు, యరమాల సుబ్బారావు, అంబటి కొండలరావు, బిళ్లా కోటేశ్వరరావు, కటకం హరిబాబు, ఆరేటి లక్మీనారాయణ, చొప్పర నరసింహం, ఎల్ గిరిరాజు, సర్పంచ్ కె నాగమణి పాల్గొన్నారు. అంబేద్కర్‌కు అధికారుల నివాళి ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : స్థానిక మిరియాలపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి, బీసీ సంక్షేమాధికారి కే మయూరి, గిరిజన సంక్షేమాఅధికారి ఎం కమల, డ్వామా పీడీ పోలప్ప, డీఈఓ రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజు, ఆర్డీఓ మురళి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఏడీ సర్వేయర్ నర సింహారావు, ఇతర అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. తదనంతరం స్థానిక అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి అధ్యక్షతన జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో దళిత సంఘాలనాయకులు యు బ్రహ్మయ్య, ఎన్ నాగేంద్రరావు, డీ శివాజి, సీహెచ్ వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆదర్శనీయుడు ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంబేద్కర్ ఆదర్శనీయుడని పశుసంవర్థకశాఖ జేడీ ఎన్ రజనీకుమారి పేర్కొన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంతపేటలోని బహుళార్థ పశువైద్యశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేడీ కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీ సురేంద్రప్రసాద్, చదలవాడ పశుక్షేత్రం ఏడీ పీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
'బాబు.. చేతనైతే జగన్‌ను నేరుగా ఎదుర్కో'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కొన్ని రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాగే కుట్రలు చేశారని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలా తయారయ్యారని, చేతనైతే జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలని జూపూడి సవాల్ విసిరారు. కౌరవుల్లా కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సీమాంధ్రలో 143 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ శుక్రవారం సమావేశమైందని, త్వరలోనే మరో సారి సమావేశమై మేనిఫెస్టోను ప్రకటిస్తామని జూపూడి ప్రభాకరరావు చెప్పారు. -
మీకెందుకు రాజకీయాలు?: జూపూడి ప్రభాకరరావు
పరాజయాల చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లుగా వరుస పరాజయాలతో టీడీపీని నడిపిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంకా రాజకీయాల్లో కొనసాగడమే దండగ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. చంద్రబాబు ఎన్నికల్లో ఒంటరిగా పోరాడలేనని ఎప్పటిలాగే ఇప్పు డూ మిగతా పార్టీలపై ఆధారపడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చంద్రబాబుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కార్గిల్ గాలిని ఉపయోగించుకుని ఒకే ఒక్కసారి మీ అధ్యక్షతన టీడీపీ గెల వడం తప్ప మీ రాజకీయ జీవితంలో ఏనాడైనా పార్టీ గెలిచిందా? * 1999 తరువాత 2014 వరకూ ఏకంగా 15 సంవత్సరాల పాటు టీడీపీకి విజయం అనేది సాధించకుండా ప్రతి ఎన్నికలో ఓడిపోతూ కూడా ఆ పార్టీ అధ్యక్ష పదవిలో ఎలా కొనసాగుతున్నారు? * 2001లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీని, మిమ్మల్ని గ్రామీణ ప్రజలు ఓడించింది నిజం కాదా? 1,094 జెడ్పీటీసీ స్థానాల్లో అధికారంలో ఉండి కూడా టీడీపీ గెలిచింది 512లో మాత్రమే.. ప్రతిపక్షాలకు 582 స్థానాలు దక్కాయి. 14,591 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ గెల్చుకున్నది 6,350 (సగానికన్నా చాలా తక్కువ) మాత్రమే. అప్పట్లో ప్రతిపక్షాలు గెల్చుకున్నవి 8,241 (సగం కన్నా చాలా ఎక్కువ) వాస్తవం కాదా? అప్పటి నుంచీ ఏ ఒక్క సార్వత్రిక ఎన్నికల్లోనూ మీరు విజయం సాధించలేదన్నది నిజం కాదా? * ఎన్టీఆర్ హయాంలో 1994 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 44.1 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన వద్దనుంచి పార్టీని లాగేసుకున్న తరువాత కార్గిల్ యుద్ధానంతరం మీ పార్టీకి వచ్చిన 43.8 శాతం ఓట్లే కదా! 2004 ఎన్నికల్లో మీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 37.59 శాతమే కదా! ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు మీ వల్ల మంచి జరుగలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన ముందు మీ దుష్పరిపాలన పోల్చడానికే వీల్లేకుండా తయారైంది కాబట్టే 2009లో మీరు మహా కూటమి అంటూ ప్రజల్లోకి వెళ్లినా వచ్చింది కేవలం 28.12 శాతం ఓట్లే. ముఖాముఖి తలపడిన ఎన్నికల్లో మీకు దక్కిన ఓట్లు కేవలం 19 శాతమే కదా! ఇంకా ఎందుకు మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు? * వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో 42 ఉప ఎన్నికలు జరిగితే (2 ఏకగ్రీవాలు కాకుండా) అందులో ఒక్కటంటే ఒక్క సీటు మీరు గెల్చుకోలేదు కదా? 21 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్ గల్లంతయింది కదా? ఇంత అద్భుతమైన పరాజయ పటిమను సంపాదించుకున్న మీరు ఇన్ని ఓటముల తరువాత పార్టీ నాయకుడిగా ఎలా ఉండగలిగారు? * 2011లో వైఎస్సార్ సీపీ ఏర్పడినప్పటి నుంచీ 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో మీ పార్టీ, మా పార్టీ ముఖాముఖి తలపడితే అందులో 17 స్థానాలు మేం గెల్చుకున్నాం. మీరు ఒక్కటంటే ఒక్కటీ గెలవక పోగా 2 లోక్‌సభ స్థానాల్లోనూ మీ పార్టీ డిపాజిట్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. * రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని లేఖ ఇచ్చి కోట్లాది మందికి కావాలని అన్యాయం చేసిన బాబు గారూ.. మీరు ఎవరికి నాయకుడు? ప్రతిపక్ష నాయకుడా? ప్రతినాయకుడా? రెండు చిప్పలు, రెండు వేళ్లు, రెండు కళ్ల సిద్ధాంతం ద్వారా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మీరు మీ పార్టీ పేరును ఏమని మార్చుకుంటా రు? వన్ బై టు టీడీపీ అని మార్చుకుంటారా? * పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగని సహకార, పంచాయతీ ఎన్నికల్లో గెలిచానని అబద్ధాలు చెప్పి టీడీపీ కార్యాలయంలో మీ కార్యకర్తలు, నేతలను ఎందుకు మోసం చేస్తున్నారు? * రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కాళ్లు నరకాలని, వందేళ్లు ఆ పార్టీని ఓడించాలని మా పార్టీ నాయకుడు పిలుపు నిచ్చారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై వ్యతిరేకతతో మీరు కాంగ్రెస్‌తో కలిసిన తరువాత, మీరు కూడా వారితో పాటే మునిగిపోవడం నిజం కాదా? ఇన్ని ఓటములు పొందిన మీరు టీడీపీకి అదృష్టం కావచ్చేమో గాని, తెలుగుజాతికి దురదృష్టం కాదా? మీరు ఏ వ్యవస్థలనైనా ప్రభావితం చేయగలరు కానీ, ప్రజలను ప్రలోభ పెట్టలేరు. (వైఎస్ మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయిన వివరాలను వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా విడుదల చేసింది.) -
'జైరాం రమేష్ కాకమ్మ కబుర్లు'
-
'జైరాం రమేష్ కాకమ్మ కబుర్లు'
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైరాం రమేష్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లులో లేని అంశాలపై జైరాం రమేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్న పార్లమెంట్, సుప్రీం కోర్టులను కూడా ఇతర ప్రాంతాలకు మారుస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో జైరాం రమేష్ ఎలా తిరుగుతారని అడిగారు. అతనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏ అధికారం ఉన్నదని సీమాంధ్ర గురించి మాట్లాడుతున్నారని ఆయన జైరాంని ప్రశ్నించారు. సీమాంధ్రకు అన్యాయం జరిగిందని భావిస్తే మీరు కేంద్రమంత్రిగా ఉండి ముందు ఎందుకు ఖండించలేదని అడిగారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ దయాదాక్ష్యిణ్యాలతో రాష్ట్రం నుంచి మీరు ఎంపీ అయ్యారన్న సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో విసిరేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలు రైతు బజార్లో పెట్టి ఫ్రీగా ఇచ్చినా తీసుకోవడానికి ఎవరూ సిద్దంగాలేని జూపూడి చెప్పారు. -
ప్రజా కోర్టులో ఆ మూడు పార్టీలకు శిక్ష తప్పదు
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీపై ఎమ్మెల్సీ జూపూడి ధ్వజం కొండపి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై తెలుగుజాతికి ద్రోహం చేశాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. స్థానిక పీఆర్ అతిథి గృహంలో గురువారం ఆయన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ సెంటిమెంటును తగ్గించేందుకు విభజన అంశాన్ని ఆ మూడు పార్టీలూ తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. బీజేపీ అగ్రనాయకులతో చంద్రబాబు అనేక రహస్య సమావేశాలు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా జూపూడి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన తర్వాత చంద్రబాబు ముఖం వెలిగిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ఐదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్ విందు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో బీజేపీ భాగస్వామ్యం కావడం విచారకరమన్నారు. బీజేపీకి దగ్గరగా జరిగిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జూపూడి డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. విభజనను నిస్సిగ్గుగా సమర్థించిన కాంగ్రెస్ దానికి వంత పాడిన బీజేపీ, దానికి పక్కలో ఉన్న టీడీపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇక నుంచి అధికారులు భయపడన వసరంలేదని ధైర్యం చెప్పారు. దేశ పార్లమెంటరీ వ్యవస్థ గురించి సోనియా, రాహుల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన జగన్‌పై సోనియా బీజేపీ సాయంతో రాష్ట్ర విభజన చేసి కక్ష తీర్చుకుందన్నారు. రాష్ట్ర విభజనకు వంతపాడిన పార్టీలు ప్రజా కోర్టులో ఓడిపోతారని జూపూడి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఉపేంద్ర, జిల్లా నాయకులు డాకా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల కన్వీనర్లు రామారావు, వెంకటేశ్వర్లు, చుక్కా కిర ణ్‌కుమార్ బీసీ, ఎస్సీ సెల్ కన్వీనర్లు రాజారపు సుబ్బారావు, గర్నిపూడి రమేశ్, విభజన విభాగం నాయకుడు రవికుమార్‌రెడ్డి, అచ్చకాయల శైలజ పాల్గొన్నారు. -
రెండూ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి: వైఎస్సార్సీపీ
* కాంగ్రెస్, బీజేపీలపై వైఎస్సార్సీపీ ధ్వజం * కాంగ్రెస్‌తో కుమ్మక్కు అవసరమేంటో బీజేపీ చెప్పాలి * కేవలం 23 నిమిషాల్లో రాష్ట్ర భవితవ్యం తేల్చేయడం కంటే ఘోరం ఉంటుందా? సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. రాష్ట్ర భవితవ్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చిందో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ నలుగురూ దుష్ట చతుష్టయంగా ఏర్పడి దుర్మార్గపూరితంగా వ్యవహరించి తెలుగుజాతిని నిట్టనిలువుగా చీల్చారని మండిపడింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్‌రావు, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో టీ-బిల్లు ఆమోదించిన తీరును వారు ఎండగట్టారు. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి, డాన్ మాదిరిగా చీకట్లో సభా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన పార్లమెంటులోనే దిక్కులేకపోతే ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులకన్నా క్రూరంగా వ్యవహరించి దేశ పరువు తీశారని ధ్వజమెత్తారు. వారు ఇంకా ఏమన్నారంటే.. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎందుకు నిలువరించలేదు? పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని తదితర డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చింది? కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టింది? ఈ విషయంలో బీజేపీ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే తెలుగుప్రజలను దారుణంగా వంచించింది. తెలుగుప్రజల వల్లే కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్‌కు ఏపీ పట్ల కృతజ్ఞతాభావం లేకపోగా.. బీజేపీతో విందు రాజకీయాలు చేసి నిట్టనిలువునా చీల్చింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ భవితవ్యంపై పార్లమెంటులో కేవలం 23 నిమిషాల్లోనే ముగిస్తారా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? గడిచిన ఆరునెలలుగా మా అధినేత జగన్మోహన్రెడ్డి అన్ని రాష్ట్రాలు తిరిగి పార్టీల మద్దతు కూడగట్టడం వల్లే లోక్‌సభలో సీపీఎం, ఏఐడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన 100 మందికిపైగా సభ్యులు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. అయితే వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై రాష్ట్రాన్ని చీల్చాయి. తలా ఒక చెయ్యి వేసి... విభజనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలుగు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు. -
తెలుగు ప్రజల రక్తంతో విందులా?
తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ నాయకులతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విందు రాజకీయాలు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా ఆ పార్టీ అభిప్రాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల రక్తంతో మీరు విందులు చేసుకుంటారా అని నిలదీశారు. రాష్ట్రాన్ని బలిపీఠంపై పెట్టారని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లు మంటల్లో కాంగ్రెస్ నాయకులు మాడి మాసైపోతారుని జూపూడి దుయ్యబట్టారు. అసలు రైల్వే బడ్జెట్‌ను 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఎప్పుడైనా జరిగిందా అని ఆయన అడిగారు. ఒకవేళ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. -
బాబు వాగ్దానాలు.. మాయ మాటలు!
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోకపోగా మళ్లీ సీఎం అయితే ఏదేదో చేస్తానంటూ మాయమాటలు చెబుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం చీలిక అంచుల్లో ఉన్నా బాబు తన విధానమేంటో చెప్పకుండా ప్రజలను గందరగోళపర్చడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఎగదోస్తూ బాబు తమాషా చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై తనది కొబ్బరి చిప్పల సిద్ధాంతమని బాబు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రం ముక్కలైతే తానెక్కడ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి పథకాలను నిర్వీర్యం చేశారని, ఇపుడు మళ్లీ సీఎం అయితే ఏవేవో చేస్తానంటున్నారని జూపూడి మండిపడ్డారు. మహిళలకు మాంగళ్యం, పీజీ వరకూ బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, బాలిక పుడితే రూ.5 వేలు ఇస్తామని, బలహీనవర్గాలకు 35 లక్షల ఇళ్లు కట్టిస్తానని బాబు ప్రకటించినా.. వాటిని నెరవేర్చలేదన్నారు. విభజనపై సరైన వైఖరి లేని వ్యక్తి ఇవన్నీ చేస్తానంటే ప్రజలు నమ్మరన్నారు. -
మండలి ఆవరణలో తోపులాట
=విభజన బిల్లు ప్రతి చింపివేతతో =టీఆర్ఎస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం =తోపులాటలో కిందపడ్డ నన్నపనేని =మండలి చైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఆవరణలో రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను చింపివేసిన ఘటన ఎమ్మెల్సీల మధ్య తోపులాటకు దారితీసింది. మండలి మీడియా పాయింట్లో టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగి ఒకరినొకరు నెట్టేసుకున్నారు. వీరి తోపులాటతో వారి పక్కనే ఉన్న ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి మరుసటి రోజుకు సభ వాయిదా పడిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నారుు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ అభిమాన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మీడియా పాయింట్‌కు వచ్చి.. ఇప్పుడే కాదు, బిల్లుపై ఎప్పుడు మండలిలో చర్చకు వచ్చినా తమ పార్టీ దానిని అడ్డుకుంటుందన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, దిలీప్‌కుమార్ విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు నన్నపనేని, శమంతకమణి, సతీష్‌రెడ్డి, రామ్మోహన్రావు అక్కడికి వచ్చి విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ బిల్లును ఈ సభలో ప్రవేశపెట్టడానికే అర్హత లేదంటూ సతీష్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో స్వామిగౌడ్ వారి వెనుకకు వచ్చి ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీలు ఆయనకు జత కలిశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం లేచినిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సతీష్‌రెడ్డి ముసాయిదా బిల్లు పత్రులను చింపే ప్రయత్నం చేయగా, పక్కనే ఉన్న స్వామిగౌడ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ దాదాపు కలబడినంత పనిచేశారు. పోలీసులు, ఇతర ఎమ్మెల్సీలు వారిని బలవంతంగా నిలువరించారు. ఈ తోపులాట సందర్భంగానే సతీష్‌రెడ్డి వెనుక నిలబడి ఉన్న నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. ఆమె చేతికి ఉన్న గాజులు పగిలి గుచ్చుకున్నాయి. ఆ తరువాత కూడా నన్నపనేని, స్వామిగౌడ్‌లతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలూ విలేకరుల సమావేశాల కోసం ఏర్పాటు చేసిన బల్లలను ఎక్కి పోటాపోటీగా నినాదాలు చేశారు. చైర్మన్‌కు ఫిర్యాదు.. స్వామిగౌడ్ పశ్చాత్తాపం ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అదే సమయంలో చైర్మన్‌కు తన వాదన వినిపించారు. అనంతరం స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పంపిన బిల్లును వ్యతిరేకించడంగానీ, చింపడంగానీ సరికాదని సతీష్‌రెడ్డికి చెప్పానన్నారు. ఈ గొడవలోనే నన్నపనేని కిందపడ్డారంటున్నారని చెప్పారు. ఆ విషయం తనకు తెలియదని, ఆమె కాలుజారి పడిపోయి ఉండొచ్చునంటూ.. ఒకవేళ తన వల్ల, తన చెయ్యి తగలడం వల్ల పడిపోయారని ఆమె బాధపడుతుంటే మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. విభజన బిల్లు చింపి వేసినందుకు వారూ తమ పశ్చాత్తాపం ప్రకటించాలని కోరారు. బిల్లును చింపడం వల్ల అది అపవిత్రమైందంటూ కొందరు ఎమ్మెల్సీలు అనంతరం పూజలు నిర్వహించారు. ఇలావుండగా తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టినప్పుడు సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసిన సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చెప్పారు. సహచర ఎమ్మెల్సీలతో కలిసి మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంగళవారం చైర్మన్‌ను కోరతామని తెలిపారు. -
దద్దమ్మలం కాదు.. అడ్డుకుని తీరుతాం: జూపూడి
-
దద్దమ్మలం కాదు.. అడ్డుకుని తీరుతాం: జూపూడి
మండలిలో సెక్రటరీ నోట్ చదివితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిందని పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. బిల్లును మండలిలో పంచకుండా తమ నిరసనను తెలిపామన్నారు. వివిధ పార్టీలకు చెందిన ఇతర మిత్రులు కూడా తమకు సహకరించారని ఆయన చెప్పారు. శ్రీనివాసులు నాయుడు, నన్నపనేని రాజకుమారి కూడా మద్దతు చెప్పారన్నారు. సమైక్యాంధ్ర మాత్రమే కావాలని, ఆమేరకు తీర్మానం చేయాలని తాము అడిగినా పట్టించుకోకుండా ఎవరో రాసిన తీర్మానం ప్రతిని తెస్తామంటే తాము దద్దమ్మలం కాదని జూపూడి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తీర్మానాన్ని అంగీకరించేది లేదన్నారు. బిల్లును పంచారని, దాన్ని తగలబెట్టారని అంటున్నారని.. పెద్దల సభలో మాత్రం ఇది అన్యాయమని ఎలుగెత్తి చాటుతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా పర్యటించి అందరినీ కోరారని చెప్పారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యంగా ఉంచాలని కోరుకుంటుండటం వల్లే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామన్నారు. కౌన్సిల్లో తమ వాదన గట్టిగా వినిపించినట్లు చెప్పారు. సీడబ్ల్యుసీ నుంచి వచ్చినా, రాష్ట్రపతి నుంచి వచ్చినా దీన్ని ఆమోదించేది లేదన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను తాము చదువుకున్నట్లు వాళ్లు చదువుకున్నారో లేదో అడగాలని చెప్పారు. అసలు డిమాండ్ ఉన్న రాష్ట్రాలన్నింటినీ వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారన్నారు. ఏ సంప్రదాయాలను రుద్దాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ అవకాశాలకు కౌన్సిల్ వేదిక కాదని, కారాదని, దీన్ని వ్యతిరేకించి తీరుతామని అన్నారు. చేతనైతే దీన్ని కౌన్సిల్లో చర్చించాలని, తమ హక్కులను కూలదోసి ఎక్కడినుంచో వచ్చిన తీర్మానాన్ని చర్చించాలంటే సహించేది లేదన్నారు. -
సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ప్రయత్నమైనా చేస్తున్నాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలవడంతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగడుతుంటే... ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ఒకే మాటను వల్లెవేస్తూ తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆ పనిచేయకపోగా కొబ్బరికాయ సలహాలిస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాత నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అడగటం, అదే లైన్లో కేంద్రం ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల మనోభావాలను గాలికొదిలేసి సిగ్గులేకుండా సొల్లుకబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్న లగడపాటి రాజగోపాల్ ఇంకా అదే పార్టీలో ఎందుకు కొనసాగుతున్నట్లని సూటిగా ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆపార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెంటనే రాష్ట్రపతి వద్దకెళ్లి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బంద్‌కు బాబు మద్దతెందుకివ్వలేదు: వాసిరెడ్డి పద్మ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, దీనివల్ల నష్టపోయే ప్రాంతాల్లో జరుగుతున్న బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనవల్ల సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగడంలేదని బాబు భావిస్తున్నారా? విభజనను సమర్థిస్తున్నారా? అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను అడ్డుపెట్టుకొని కృష్ణానదీ మిగులు జలాలు దక్కకుండా చేసిన సోనియాగాంధీ చర్యలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమ అధినేత జగన్ నిర్ణయించారని చెప్పారు. -
కొబ్బరికాయ సిద్ధాంతమేంటి బాబూ?: జూపూడి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబులాగా తెర ముందు ఒకలా, తెర చాటున మరోలా నటించడం తమ పార్టీకి చేతకాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. చంద్రబాబుకు విధానమంటూ ఒకటుందా? అని ఆయన ప్రశ్నించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ 2008లో కేంద్రానికి లేఖ ఇచ్చారు. ప్రధానికి రాసిన లేఖలో సమన్యాయం అన్నారు. తాజాగా రాష్ట్రపతికి రాసిన లేఖలో కొబ్బరికాయ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అసలు చంద్రబాబుకు మైండు పనిచేస్తుందా అన్నది అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. రూ. 5 లక్షల కోట్లే కొబ్బరికాయ సిద్ధాంతంలో ఉన్నట్లుందని జూపూడి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపర్చాలని గవర్నర్‌ను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెండు సార్లు కోరారని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం తనకు పట్టనట్లు ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా సమైక్యం వైపు రాకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని హెచ్చరించారు. కొబ్బరికాయ పగులగొట్టినంత సులువుగా రాష్ట్రాన్ని విడగొట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో జూపూడి ఈ విధంగా స్పందించారు. -
ప్రజల మేలు కోరేవారంతా వైఎస్సార్ సీపీలో చేరాలి
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రజల మేలు కోరేవారంతా వైఎస్సాఆర్ సీపీలో చేరాలని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. బైభీమ్ పత్రిక చీఫ్ ఎడిటర్ చిక్కాల రూజ్వెల్ట్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరడంతో ఈ సందర్భంగా ఆయన్ను జూపూడి అభినందించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జూపూడి మాట్లాడుతూ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నిజమవుతాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా దళిత వర్గాల్లోని మేధావులు వైఎస్సాఆర్ సీపీకి అండగా ఉండాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పనిచేస్తోంది ఒక్క వైఎస్సార్సీపీయేనని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ, విభజించిన కాంగ్రెస్ పార్టీకి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించే అర్హత లేదన్నారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని జూపూడి కోరారు. రూజ్వెల్ట్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పాటుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. సమైక్య సభ విజయవంతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జూపూడిని సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తాడితోటి నరసింగరావు, కొండపి, టంగుటూరు మండలాల పార్టీ కన్వీనర్లు ఉపేం ద్ర చౌదరి, బొట్ల రామారావు, టంగుటూరు, జరుగుమల్లి, ఎస్‌ఎన్‌పాడు మండలాల ఎస్సీ సెల్ కన్వీనర్లు దాసరి సుబ్బారావు, జజ్జర బాలకోటయ్య, దమ్మాల శ్రీను, యువజన విభాగం జిల్లా నాయకుడు గుడిమెట్ల శ్రీనివాసరావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బత్తుల గోపాలకృష్ణ నాయకులు పట్రా బంగారం, బి.శేషయ్య పాల్గొన్నారు. -
పోరాటాన్ని ఎంచుకున్న వైఎస్ఆర్ సీపీ
కొండపి, న్యూస్‌లైన్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటాన్నే మార్గంగా ఎంచుకుందని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక మండల కార్యాలయం ఎదుట బుధవారం ఆయన నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు నిరాహార దీక్ష చేపట్టినట్లు జూపూడి తెలిపారు. రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలతో సంబంధం లేకుండా తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన చంద్రబాబు, అసమర్థ సీఎం ఇప్పుడు మేలుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడి ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంటే పాలకులు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని 16 నెలలు అక్రమంగా జైలులో ఉంచేందుకు కాంగ్రెస్‌తో కలిసి కుట్ర చేసింది చంద్రబాబా కాదా.. అన్ని ప్రశ్నించారు. తెలుగు ఆత్మ గౌరవయాత్ర పేరుతో కొండపిలో పర్యటించనున్న చంద్రబాబును సమైక్యవాదివా.. విభజన వాదివా.. చెప్పాలంటూ ప్రజలు నిలదీయాలని జూపూడి పిలుపునిచ్చారు. రామరాజ్యం అంటే ఏమిటో ప్రజలకు చూపిన వ్యక్తి దివంగత నేత వైఎస్ఆర్ అని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. జూపూడికి సంఘీభావం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్డారెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల పార్టీ కన్వీనర్లు ఉపేంద్ర, బొట్ల రామారావు, చుక్కా కిరణ్‌కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, రమణారెడ్డి పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు యాత్ర : గొట్టిపాటి అద్దంకి, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకుడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం స్థానిక బంగ్లా సమీపంలో బుధవారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్ర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మినహా మిగిలిన పార్టీలన్నీ రాష్ట్ర విభజకు అనుకూలమేనన్నారు. భాషా ప్రాతిపదికపై ఏర్పాటైన తెలుగు రాష్ట్రాన్ని విభజించేందుకు నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పెద్దలేవరూ సాహసించలేదని గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా తెలంగాణ రాష్ట్రం కావాలని కొందరు ఆందోళన చేసినా ఆయన సమైక్యవాదాన్నే బలపరిచారన్నారు. అప్పట్లో కేంద్రం కూడా విభజన విషయంపై ఏమీ మాట్లాడలేదని గుర్తుచేశారు. మహానేత వైఎస్ఆర్ కృషితో రెండు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఓట్లు..సీట్ల కోసం తెలుగు ప్రజలను విడదీయాలని చూస్తోందన్నారు. 63 రోజులుగా సీమాంధ్రలో అన్ని వర్గాలవారు ఉద్యమం చే స్తుంటే కేంద్ర పట్టించుకోకుండా తన పంతం నెగ్గించుకోవాలని చూడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉండి తీరుతుందని గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు. సమన్యాయం చేయకుండా విభజన అంటే ఎలా : నూకసాని కందుకూరు, న్యూస్‌లైన్ : తండ్రిలా సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఎలా అని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్, పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామితో కలిసి స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బుధవారం ఆయన దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావంగా మరో సమన్వయకర్త తూమాటి మాధవరావు రిలే దీక్ష చేపట్టారు. సమన్వయకర్తలకు పార్టీ నాయకుడు వైవీ భద్రారెడ్డి దండలు వేసి దీక్షను ప్రారంభింపజేశారు. అనంతరం నూకసాని మాట్లాడుతూ కొందరి రాజకీయ నాయకుల స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారే తప్పా ప్రజల మేలు కోసం కాదని ధ్వజమెత్తారు. తండ్రిలా రాష్ట్రాన్ని విభజించే ముందు కనీసం సమన్యాయం చేయాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దలకు లేకపోవడం విచారకరమన్నారు. మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి మాట్లాడుతూ రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్ సీపీ మొదటి నుంచీ ఒకే మాటపై ఉందని గుర్తు చేశారు. మరో సమన్వయకర్త తూమాటి మాధవరావు మాట్లాడుతూ 1972లో రాష్ట్ర విభజన కోసం ఉద్యమం చెలరేగితే అప్పట్లో మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా అందలమెక్కించి రాష్ట్ర విభజన ఉద్యమాన్ని నీరుగార్చిన సంగతి ఇంకా సీమాంధ్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. కావాలని రాజకీయ నిరుద్యోగులు కొంతమంది పోగై వేర్పాటు వాదాన్ని తెరమీదకు తెచ్చారే తప్పా ప్రజల ఆకాంక్ష కోసం కాదని ధ్వజమెత్తారు. వేర్పాటు వాదం విత్తనాన్ని కేసీఆర్ నాటితే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నీరు పోసి పెంచారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు పీవీ రమణయ్య, దార్ల కోటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు వసంతలక్ష్మి, వైఎస్ఆర్ సీపీ మహిళ నాయకురాలు యనమల మాధవి, యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ రఫీ, కూనం రామకృష్ణారెడ్డి, ఫజుల్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొల్లూరి కొండయ్య (గ్యాస్), సుదర్శి శ్యామ్, ఇరపని అంజయ్య, జిల్లా నాయకులు కంది అంజిరెడ్డి, వరికూటి కొండారెడ్డి, రామాల శింగారెడ్డి, యజాజ్అహ్మద్, నగళ్ల నారయ్య, బాలరాఘవ్‌యాదవ్, పంది కోటేశ్వరరావు, అల్లం రాధయ్య, యాసిన్, కుంచాల ట్రస్ట్ కోటేశ్వరరావు, వెంకటరామిరెడ్డి, నజీర్, రసూల్, వెంకట్రావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కెనడాకు చెందిన ప్రవాస భారతీయుడు వి.వి.రామారావు రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ వెబ్‌సైట్‌ను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఏర్పడిన పార్టీ కమిటీలను సమన్వయం చేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఈ వెబ్సైట్ (ఐసీసీవైఎస్ఆర్సీపీ డాట్‌కామ్)ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయసాధన, పార్టీ సిద్ధాంతాల ప్రచారం ప్రధాన ఆశయాలుగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు కొణతాల రామకృష్ణ, షర్మిల, జూపూడి ప్రభాకర్‌రావు, ఐటీ విభాగం నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్ష, వి.రమేష్‌బాబు, కె.వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
కాకి లెక్కలొద్దు బాబూ! : జూపూడి ప్రభాకరరావు
- ఆస్తుల ప్రకటనపై జూపూడి ధ్వజం - విజయమ్మ పిటిషన్‌పై విచారణకు సిద్ధం కావాలి - లోకేష్ ఆస్తులు ఎందుకు తగ్గాయి.. బినామీ ఆస్తుల మాటేమిటి? - రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆస్తుల ప్రకటనేమిటంటూ ధ్వజం నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నివాసమిది. 1,125 గజాల్లో ఉన్న ఈ ఇంటి విలువ కేవలం 23.2 లక్షలేనని బాబు చెబుతున్నారు. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో! సాక్షి, హైదరాబాద్: ఆస్తుల ప్రకటన పేరుతో కాకి లెక్కలు చెప్పొద్దని చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు హితవు పలికారు. బాబుకు ఏ మాత్రం నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నా ఆయన ఆస్తులకు సంబంధించి గతంలో వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లోని అంశాలపై విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. ఆస్తుల వెల్లడి పేరుతో సోమవారం చంద్రబాబు చేసిన ప్రకటనను సోమవారం జూపూడి విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ‘‘బాబు ప్రకటించిన ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకే. అవే గనక నిజమని ఆయన భావిస్తే గతంలో విజయమ్మ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఎందుకు గందరగోళపడిపోయారు? మూడు చెరువుల నీళ్లు తాగిన విధంగా హడావుడి పడి, కేసులు లేకుండా ఎందుకు చేసుకున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘మీరు నిజంగా అవినీతిపై యుద్ధం చేయదల్చుకుంటే తొలుత మీపై విజయమ్మ వేసిన పిటిషన్‌ను తిరగదోడాలని చెప్పి విచారణకు ముందుకు రండి, ఐఎంజీ భూముల కేటాయింపు, ఎమ్మార్ ఉదంతంలో మీరు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయాలని కోరండి’ అన్నారు. రాష్ట్రం నిలువునా చీలిపోతుందేమోనన్న ఆందోళనతో ఒకవైపు సంక్షోభం నెలకొన్న తరుణంలో, మెడమీద కత్తిలాగా ఢిల్లీ కుట్రలకు రాష్ట్ర ప్రజలు బలవుతూ ఉంటే... బాబు మాత్రం వాటి గురించి మాట్లాడకుండా ‘నేను ఆస్తులు ప్రకటించాను. మీరూ ఆస్తులు ప్రకటించండి’ అనడం విడ్డూరమంటూ ధ్వజమెత్తారు. బాబు అవినీతిపరుడు కాకపోతే ఆయనపై 2,421 పేజీలతో విజయమ్మ వేసిన పిటిషన్‌పై కోర్టు ఆదేశించిన విచారణను ఎందుకు అడ్డుకున్నార ని ప్రశ్నించారు. జనం నమ్ముతారనుకోవడం బాబు భ్రమ బాబు తన బినామీ ఆస్తులను ప్రకటించకుండా తన భార్య, కుమారుడు, తాత ముత్తాతల వివరాలనే ప్రకటించారని జూపూడి అన్నారు. గతేడాదితో పోలిస్తే బాబు, ఆయన భార్య, కోడలి ఆస్తులు పెరిగినా... కేవలం కుమారుడు లోకేశ్ ఆస్తులే ఎందుకు తగ్గాయో వివరణ ఇవ్వలేదన్నారు. ‘‘ఎందుకిలా తగ్గాయి? ఇదేమైనా స్టాక్ మార్కెటా? లేక మీ కుమారుడికి వ్యాపారం చేతకాక నష్టాల్లో పడిపోయారా?’ అని ప్రశ్నించారు. బాబు బినామీ ఆస్తులు, వ్యాపారాలు, సింగపూర్ వ్యవహారాలు, లోకేశ్ చదువు, వెలగబెట్టిన డి గ్రీలు, సత్యం రామలింగరాజు వ్యవహారం... ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. ఆస్తులు ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం బాబు భ్రమేనన్నారు. ‘‘రాష్ట్రం నిలువునా చీలి రెండు ప్రాంతాలు ఉద్యమాల్లో ఉంటే ఏం చేయాలో అర్థం కాక, అనుమానిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక బస్సు యాత్ర నుంచి పారిపోయి తిరిగొచ్చిన బాబుకు హఠాత్తుగా ఆస్తుల వెల్లడి వ్యవహారం గుర్తుకొచ్చింది! సమయం, సందర్భం లేకుండా, ప్రజలకు జ్ఞాపకశక్తి ఉండదని భావించి ఆస్తులు ప్రకటించారు. రాష్ట్రం విడిపోవద్దంటూ ఓవైపు ప్రజలు గగ్గోలు పెడుతూన్నా వారేం భావిస్తున్నారో తెలుసుకోకుండా బాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉంది. ఆస్తుల ప్రకటన చేస్తే పోయిన ప్రాభవం తిరిగి వస్తుందన్న బాబు ఆశలు నెరవేరబోవన్నారు. ‘నేతలు తమ ఆస్తులు ప్రకటిస్తే దేశంలో అవినీతి తగ్గి పోతుందా? ఇదెక్కడి కొత్త సిద్ధాంతం?’ అని ప్రశ్నించారు. -
బాబూ కాకమ్మ కథలు చెప్పడం మానుకో: జూపూడి
-
బాబూ కాకమ్మ కథలు చెప్పడం మానుకో: జూపూడి
హైదరాబాద్: కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆస్తులు నిజమేనని భావిస్తే గతంలో వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై విచారణ కోరాలన్నారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటిస్తే దేశంలో అవినీతి తగ్గుతుందా? అని ప్రశ్నించారు. మీ కాకి లెక్కలకి దేశంలో అవినీతి తగ్గుతుందా చంద్రబాబు అని అడిగారు. చంద్రబాబు బినామీ ఆస్తులు ఎక్కడున్నాయో కనుక్కోవాల్సి బాధ్యత ప్రజలకు లేదని చెప్పారు. చంద్రబాబు తీరు నీరో చక్రవర్తిని తలపిస్తుందన్నారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం గురువిందగింజ సామెతను గుర్తుకుతెస్తుందన్నారు. ఈ ఆస్తుల విలువను ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు. గతంలో ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకి మధ్య లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పలేదన్నారు. -
హైకోర్టు ఘటనను ఖండిస్తున్నాం: జూపూడి ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ఆవరణలో లాయర్ల మధ్య చోటు చేసుకున్న సంఘటన, కొందరు న్యాయవాదులపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కోర్టు ఆవరణలో.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేవిగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇరుప్రాంతాలను అశాంతికి గురిచేసి ప్రజలను తన్నుకు చావండంటూ కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బాధ్యత వహించాల్సిన పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం తమకు పట్టనట్టు, కళ్లుండి గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్ర భవితవ్యం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు. -
జూపూడి ప్రభాకర్ రావు మీడియా సమావేశం
-
లాయర్లపైనే దాడి చేస్తే మిగతావారి పరిస్థితేంటి?
హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ అన్నారు. లాయర్లపైనే దాడి చేస్తే మిగిలినవారి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో న్యాయవాదులపై దాడి ప్రజాస్వామ్య విలువలు దిగజార్చేలా ఉందని అన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణించాలన్నారు. పరిస్థితిని అదుపుచేయలేకుంటే ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోలీసు కమిషనర్ కలిసిన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా అని అడిగారు. శాంతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని జూపూడి విమర్శించారు. హైకోర్టులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
అసమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం అల్లకల్లోలం
ఒంగోలు : అసమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం అల్లకల్లోలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవుల కోసమే రాష్ట్రాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వైఎజ్ జగన్‌ను జైలులో పెట్టి రాష్ట్రాన్ని విడగొడితే ప్రజలు ఊరుకోరని జూపూడి అన్నారు. కొండేపి మండలం కె.ఉప్పలపాడులో వైఎస్ఆర్ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వానికి భాద్యత లేదా?: జూపూడి ప్రభాకర్‌రావు
-
జగన్ దీక్ష విరమించండి: జూపూడి
-
జగన్ దీక్ష చేయాలనుకుంటే పెద్ద నిర్ణయమే-జూపూడి
-
'విజయమ్మ దీక్ష భగ్నానికి కాంగ్రెస్, టీడీపీల కుట్ర'
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర భేరీ దీక్షను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రపన్ని భగ్నం చేశాయని ఆ పార్టీ అధికర ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. శనివారం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత అర్థరాత్రి విజయమ్మ దీక్షపై పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల జూపూడి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమరభేరి దీక్షతో తీవ్ర అనారోగ్యానికి గురైన విజయమ్మను పోలీసు వ్యాన్‌లో తీసుకువెళ్లడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ముందుగా అంబులెన్స్‌ను ఎందుకు సిద్ధం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కు అయి విజయమ్మ దీక్షను భగ్నం చేశాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతలకు సమన్యాయం కోసం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆ అంశంపై మిగతపార్టీలు గోడమీద పిల్లివాటంలా తయారయ్యాయని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన మహా ఉద్యమంగా భావిస్తున్నామని జూపూడి ప్రభాకర్ రావు అభివర్ణించారు. -
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు
ఒంగోలు : రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు మంచివే అన్నారని.... అయితే ప్రజాభీష్టానికి భిన్నంగా విభజన చేయమని ఆయన చెప్పలేదని జూపూడి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ విజయమ్మ దీక్ష రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని జూపూడి తెలిపారు. కాగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో 18వ రోజు బంద్ కొనసాగుతోంది. ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలతో సీమాంధ్ర జిల్లాలు హోరెత్తుతున్నాయి. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం రెండుముక్కలు: జూపూడి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడివి అవకాశవాద రాజకీయాలని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను అనుకూలమేనంటూ ఒకవైపు కేంద్రానికి లేఖ ఇచ్చి, తర్వాత ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై కూడా జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆయన విమర్శించారు. -
జగన్, విజయమ్మ రాజీనామాలపై ఎమ్మెల్సీ జూపూడి హర్షం
నెల్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా కిరణ్ సర్కార్ తయారుచేసిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణం రాష్ట్రానికి తీరని లోటని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమాలపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు లోక్‌సభలో ఏమీ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం, చంద్రబాబు నక్కనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీల కోసం బాబు పనిచేస్తున్నారని జూపూడి ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడితే, చంద్రబాబు మాత్రం ఆ కుటుంబాన్ని చీల్చి, అదే తరహాలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్సీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్య, మౌలిక వసతులు, ఆర్థిక సమయ్య, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆయనన్నారు. -
రాష్ట్ర విభజన పై చంద్రబాబు విధానమేంటి:జూపూడి
-
విభజనపై చంద్రబాబు మౌనంలో అంతరార్థమేంటీ?
-
వైఎస్‌ను మరచిన ప్రభుత్వం: జూపూడి