
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి రాజీనామా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు పార్టీకి రాజీనామా చేశారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.