తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడివి అవకాశవాద రాజకీయాలని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను అనుకూలమేనంటూ ఒకవైపు కేంద్రానికి లేఖ ఇచ్చి, తర్వాత ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీపై కూడా జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆయన విమర్శించారు.