ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రజల మేలు కోరేవారంతా వైఎస్సాఆర్ సీపీలో చేరాలని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. బైభీమ్ పత్రిక చీఫ్ ఎడిటర్ చిక్కాల రూజ్‌వెల్ట్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరడంతో ఈ సందర్భంగా ఆయన్ను జూపూడి అభినందించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జూపూడి మాట్లాడుతూ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నిజమవుతాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా దళిత వర్గాల్లోని మేధావులు వైఎస్సాఆర్ సీపీకి అండగా ఉండాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పనిచేస్తోంది ఒక్క వైఎస్సార్‌సీపీయేనని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ, విభజించిన కాంగ్రెస్ పార్టీకి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించే అర్హత లేదన్నారు.
ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని జూపూడి కోరారు. రూజ్‌వెల్ట్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పాటుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. సమైక్య సభ విజయవంతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జూపూడిని సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తాడితోటి నరసింగరావు, కొండపి, టంగుటూరు మండలాల పార్టీ కన్వీనర్లు ఉపేం ద్ర చౌదరి, బొట్ల రామారావు, టంగుటూరు, జరుగుమల్లి, ఎస్‌ఎన్‌పాడు మండలాల ఎస్సీ సెల్ కన్వీనర్లు దాసరి సుబ్బారావు, జజ్జర బాలకోటయ్య, దమ్మాల శ్రీను, యువజన విభాగం జిల్లా నాయకుడు గుడిమెట్ల శ్రీనివాసరావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బత్తుల గోపాలకృష్ణ నాయకులు పట్రా బంగారం, బి.శేషయ్య పాల్గొన్నారు.
ప్రజల మేలు కోరేవారంతా వైఎస్సార్ సీపీలో చేరాలి
Published Wed, Oct 23 2013 6:18 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement