గుంటూరు సిటీ : అనామకుడిగా ఉన్న తనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిన జూపూడి ప్రభాకరరావు దళిత ద్రోహి అని రెల్లి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సోమి కమల్ అభివర్ణించారు. ఆయన యావత్ దళిత జాతికే ద్రోహం తలపెట్టే మహానుభావుడని ధ్వజమెత్తారు. జూపూడి వ్యవహారం కచ్చితంగా అవకాశవాద రాజకీయాల కిందకే వస్తుందన్నారు. జూపూడి వైఖరిని నిరసిస్తూ సోమవారం రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకి అయిన జూపూడిని పార్టీలోకి తీసుకోవ డం చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తక్షణం తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని కమల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెల్లి సంఘం నేతలు రవుతులాల్, భూపతి దీరరాజు, బండిశ్రీను, కోనా విశ్వనాథ్, బొబ్బిలి దుర్గాప్రసాద్, బండి వాసు పాల్గొన్నారు.
‘జూపూడి దళిత ద్రోహి ’
Published Tue, Dec 23 2014 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement