Dalit mole
-
కేసీఆర్ దళిత ద్రోహి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ దళిత ద్రోహి అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పిన మాట తప్పిన మొదటి సీఎం కేసీఆర్ అని పొన్నాల అన్నారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని, దళితులకు మూడెకరా ల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్... అధికారం దక్కాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సైతం అమలు చేయకుండా మోసం చేస్తు న్నారన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని మోదీ అధోగతి పాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 19 నుంచి నియోజకవర్గ స్థాయిలో జన ఆవేదన సమ్మేళనాలను నిర్వహిస్తు న్నామని పొన్నాల తెలిపారు. -
‘జూపూడి దళిత ద్రోహి ’
గుంటూరు సిటీ : అనామకుడిగా ఉన్న తనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిన జూపూడి ప్రభాకరరావు దళిత ద్రోహి అని రెల్లి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సోమి కమల్ అభివర్ణించారు. ఆయన యావత్ దళిత జాతికే ద్రోహం తలపెట్టే మహానుభావుడని ధ్వజమెత్తారు. జూపూడి వ్యవహారం కచ్చితంగా అవకాశవాద రాజకీయాల కిందకే వస్తుందన్నారు. జూపూడి వైఖరిని నిరసిస్తూ సోమవారం రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకి అయిన జూపూడిని పార్టీలోకి తీసుకోవ డం చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తక్షణం తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని కమల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెల్లి సంఘం నేతలు రవుతులాల్, భూపతి దీరరాజు, బండిశ్రీను, కోనా విశ్వనాథ్, బొబ్బిలి దుర్గాప్రసాద్, బండి వాసు పాల్గొన్నారు.